పద్మశ్రీ పురస్కార గ్రహీతలకు ప్రధాని అభినందనలు 

పద్మ అవార్డుల రెండవ విడత ప్రదానోత్సవం మంగళవారం రాష్ట్రపతి భవన్ లో అత్యంత వైభవంగా జరిగింది .

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 65 మంది ప్రముఖులకు ఈ అవార్డులను ప్రదానం  చేశారు .

ఇందులో ఇద్దరు పద్మ విభూషణ్ , ఏడుగురు పద్మ భూషణ్ , 56మంది పద్మశ్రీ పురస్కారాన్ని స్వీకరించారు . 

న్యూ ఢిల్లీ రాష్ట్రపతి భవన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్ , ప్రధాని నరేంద్ర మోడీ , లోక సభాపతి ఓం బిర్లా , మాజీ రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ , హోమ్ మంత్రి అమిత్ షా , విమాన శాఖా మంత్రి కె .రామ మోహన్ నాయుడు , కేంద్ర మంత్రి బండి సంజయ్ తదితరులు హాజరయ్యారు .

ఈసారి పద్మశ్రీ పురస్కారాన్ని నటులు మాగంటి మురళీ మోహన్ , గద్దె రాజేంద్ర ప్రసాద్ స్వీకరించారు.


సినిమా రంగంలో వీరు సాధించిన విజయానికి ఈ అవార్డు లభించింది . 

2026 పద్మ పురస్కార గ్రహీతల జీవితం ఎంతో  స్ఫూర్తిదాయకమని  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. 

జూన్ 23న రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఈ అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొన్న ప్రధాని మోడీ అందరినీ  అభినందించారు . 

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 65 మందికి పద్మ పురస్కారాలను ప్రదానం చేసినతరువాత ప్రధాని మోడీ వారితో  మాట్లాడారు.


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు