తెలంగాణ తొలి తరం నట రత్నం 

పైడి జైరాజ్ 


తెలంగాణ ప్రాంతం నుంచి బొంబాయి నగరానికి వెళ్లి తన ఉనికిని చాటుకొంటూ హిందీ చిత్ర రంగంలో అత్యున్నత స్థాయికి ఎదిగి, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుకు ఎంపికైన  నటుడు పైడి జైరాజ్. జైరాజ్. శాంతారామ్, అశోక్ కుమార్, పృథ్వీరాజ్ కపూర్, మోతీలాల్ సమకాలీకుడైన జైరాజ్ ప్రతిభావంతుడైన నటుడు , నిర్మాత , దర్శకుడు . 'భారత కోకిల' సరోజిని నాయుడు భర్త ముత్యాల గోవింద రాజులు నాయుడు జైరాజ్ కు స్వయానా మేనమామ. అయినా ఆ విషయాన్ని ఎప్పుడూ ఆయన చెప్పుకోలేదు .

జైరాజ్ 11 మూకీ చిత్రాల్లో , 156 టాకీ చిత్రాల్లో నటించాడు .

 హిందీ తో పాటు ఉర్దూ , మరాఠీ , గుజరాతీ భాషల్లో వైవిధ్యమైన పాత్రల్లో నటించాడు . 

జైరాజ్ పూర్తి పేరు పైడిపతి జైరుల  నాయుడు.  1909 సెప్టెంబరు 28న  కరీంనగర్ లో  అచ్యుతయ్య నాయుడు, తాయారమ్మ దంపతులకు జన్మించాడు.

తండ్రి ఉద్యోగరీత్యా ఆ కుటుంబం హైదరాబాద్ కు వచ్చేసింది . జైరాజ్ విద్యాభ్యాసం ఇక్కడే సాగింది . చదువుకునే రోజుల్లోనే నటనపై ఆసక్తి ఏర్పడింది . నిజాం కళాశాలలో బీఎస్సీ చదువుతూ నాటకాల్లో నటించేవాడు . క్రమంగా చదువుకున్నా నాటకాలకు ప్రాధాన్యత ఇవ్వసాగాడు . చదువును మధ్యలో  వదిలి 1928లో బొంబాయి నగరానికి వెళ్ళిపోయాడు . 


మూకీ సినిమాల్లో నటించడానికి , బొంబాయి లో బ్రతకటానికి సినిమాకు సంబంధించిన  అనేక పనులు చేశాడు . కష్టాలు , నష్టాలు భరించాడు . అవమానాలను దీవెనులుగా భావించాడు . తాను నమ్మిన లక్ష్యం వైపు అడుగులు వెయ్యసాగాడు . ఆయన కృషి వృధాగా పోలేదు . 1929లో ‘స్టార్ క్లింగ్ యూత్’ అనే మూకీ సినిమాలో ఓ వేషం సంపాదించాడు . అదే జైరాజ్ జీవితాన్ని మలుపు తిప్పింది . ఆ తరువాత అనేక మూకీ సినిమాల్లో అవకాశలు వచ్చాయి. 

1931 లో టాకీ సినిమాలు మొదలయ్యాయి . జైరాజ్ కు 'షికారీ'  అనే  టాకీ లో నటించే అవకాశం వచ్చింది . ఆ తరువాత జైరాజ్ ప్రతిభను సినిమా రంగం గుర్తించింది . జైరాజ్ పెరిగింది హైదరాబాద్ లో కావడంవల్ల ఉర్దూ బాగా మాట్లాడేవాడు .దీనికి తోడు ఆకట్టుకొనే రూపం .నటనలో అనుభవం జైరాజ్ ను వెతుక్కుంటూ అవకాశాలు వచ్చాయి .

మాయా జాల్, పటిట్ పవన్, ఔరత్ కా దిల్, మజ్దూర్, షేర్ దిల్ ఔరత్, జీవన్ నాటకం,తూఫానీ ఖజానా, బాబీ,మధుర్ మిలన్,

జుగారి, లెదర్‌ఫేస్, చాంబే ది కలి,ప్రభాత్, మాలా,స్వామి ,నయీ దునియా, ఖిలోనా, తమన్నా,నయీ కహానీ, హమారీ బాత్,

ప్రేమ్ సంగీత్, పన్నా,రహత్,షాజహాన్,సల్గిరా, రాజ్‌పుతాని, మన్మణి, సాజన్ కా ఘర్,,అంజుమన్, ఆజాదీ కి రాహ్ పర్,దరోగాజీ

రూమల్,,సింగార్, అమర్ కహానీ, రాజ్‌పుత్, సాగర్,లాల్ కున్వర్, రేషమ్, బాద్బాన్ , తీరాండాజ్, ఇన్సానియత్ , పరివార్

హతిమ్ తాయ్,ముంతాజ్ మహల్,చార్ దిల్ చార్ రహేన్,రిటర్న్ ఆఫ్ ఎ సూపర్ మేన్ ,లాల్ ఖిలా,వీర్ దుర్గాదాస్,చాంబే ది కలి

రజియా సుల్తానా, ఆస్ కా పంచీ, జై చితోడ్,పిక్ పాకెట్,గుల్-ఎ-బకావాలి ,ఖుఫియా మహల్,బాఘి హసీనా, ముజ్రిం కౌన్ ఖూని కౌన్,

మాయ, బహరోన్ కే సప్నే, నీల్ కమల్, గుణా ఔర్ కానూన్, జీవన్ మృత్యు,నాదాన్ ,చోటీ బహు, చింగారి, షెహ్జాదా, గెహ్రీ చాల్

సూరజ్ ఔర్ చందా, ఛలియా ,నాగ మేరే సాథీ, చోర్ చోర్, ఫస్లా, షోలే, కాలా సోనా, ధర్మాత్మ చిత్రాల్లో జైరాజ్ వైవిధ్యమైన పాత్రల్లో నటించాడు . 1951లో  నర్గీస్ నాయికగా 'సాగర్' అనే చిత్రాన్నిజైరాజ్ లో నిర్మించాడు.

 షాజహాన్, పృధ్వీరాజ్ చౌహాన్, రాణా ప్రతాప్, టిప్పు సుల్తాన్, అల్లావుద్దీన్, చంద్రశేఖర ఆజాద్ లాంటి పాత్రల్ని ధరించిన జైరాజ్ 

ప్రేక్షకులతో ప్రశంసలు అందుకున్నాడు . 


అయితే జైరాజ్ తెలుగు వాడై వినండి కూడా ఒక్క తెలుగు చిత్రంలోనూ నటించలేదు . 

 1980లో  భారతీయ సినిమా రంగానికి చేసిన సేవలకు భారత ప్రభుత్వం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో  గౌరవించింది. ఈ అవార్డు అందుకున్న రెండవ తెలుగు వాడు జైరాజ్ కావడం విశేషం . 

జైరాజ్ సావిత్రి అనే పంజాబీ  యువతిని వివాహం చేసుకున్నాడు .  ఈ దంపతులకు   ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. 1995లో జైరాజ్ నటించిన చివరి చిత్రం 'గాడ్ అండ్ గన్ ' సినిమా విడుదలయ్యింది . 

2000 సంవత్సరం ఆగష్టు 11న తన 91వ ఏట  జైరాజ్ తుది శ్వాస విడిచారు . 

బి .ఆర్ .ఎస్  ప్రభుత్వం జైరాజ్ పేరుతో  ‘పైడి జైరాజ్‌ ప్రివ్యూ థియేటర్‌’ను రవీంద్ర భారతిలో ప్రారంభించారు . 

కాంగ్రెస్ ప్రభుత్వం గద్దర్ ఫిలిం అవార్డుల్లో జైరాజ్ పేరుతో జాతీయ అవార్డును ప్రవేశపెట్టింది .

తెలంగాణ మట్టిలో పుట్టి నట రత్నం గా ఎదిగిన జైరాజ్ ఎందరికో స్ఫూర్తిని కలిగించారని చెప్పడంలో అతిశయోక్తి లేదు . 


Comments

Popular posts from this blog