34 సంవత్సరాలనాటి స్మృతి  చిత్రమ్ 

చేగొండి హరి రామ జోగయ్య గారు ఈరంకి శర్మ గారి దర్శకత్వంలో రూపొందించిన "అగ్నిపుష్పం " సినిమా షూటింగ్ పాలకొల్లులో మొదలైంది . ఇందులో సీత, శుభాకర్ హీరో హీరోయిన్లు . ఈ సినిమా షూటింగ్ కవర్ చెయ్యడానికి నిర్మాత  హరి రామ జోగయ్యగారు  హైదరాబాద్ నుంచి  జర్నలిస్టులను ఆహ్వానించారు . 20 ఏప్రిల్ 1987న సినిమా ప్రారంభోత్సవం జరిగింది . 

అదేరోజు సాయంత్రం ఈ సినిమాలో ప్రత్యేక పాత్రలో నటించిన కుయిలీ రూమ్ కి నాతో పాటు వినాయక  రావు , కేశవ్ రావు , వెంకట రావు వెళ్లి ఆమెతో కాసేపు మాట్లాడాము. 

అప్పట్లో హీరో హీరోయిన్ , మిగతా నటీనటులు జర్నలిస్టులతో సరదాగా మాట్లాడేవారు . వారి వ్యక్తిగత విషయాలను కూడా పంచుకునేవారు . అయితే వారికి ఇబ్బంది కలిగించేలా ఎవరూ వ్రాసేవారు కాదు . అందుకే జర్నలిస్టులంటే ఆత్మీయులుగా భావించేవారు. అప్పటి రోజుల్లో సినిమా షూటింగ్ లో జర్నలిస్టులు పాల్గొనేవారు . బహుశ అలాంటి ఆహ్లాద వాతావరణం ఇప్పుడులేదనుకుంటా .

Comments

Popular posts from this blog