40 సంవత్సరాలనాటి జ్ఞాపక చిత్రమ్
ఈరోజు గాన కోకిల ఎస్ జానకి గారి పుట్టినరోజు.. విలక్షణమైన జానకి గారు 15 భాషల్లో పాటలు పాడారు .ఆమె స్వరంలో సరిగమలు అలవోకగా జాలువారుతాయి .
జానకి గారితో నేను 1981 నవంబర్ 1వ తేదీన హైదరాబాద్ లోని అశోక హోటల్లో ఇంటర్వ్యూ చేశాను. అప్పట్లో మద్రాస్ నుంచి సినిమా వారు హైదరాబాద్ వస్తే అశోక హోటల్లో బస చేసేవారు .
అప్పుడు నేను ఆంధ్ర జ్యోతి నుంచి వెలువడే జ్యోతి చిత్ర రిపోర్టర్ గా ఉండేవాడిని. జానకి గారిని ఇంటర్వ్యూ చెయ్యడానికి వెళ్ళినప్పుడు నాతో పాటు ఫోటోగ్రాఫర్ శ్యామ్ కూడా వచ్చాడు .
తన జీవితం , సంగీత ప్రస్థానం గురించి జానకి గారు వివరించారు .
ఎంత ఎదిగినా ఒదిగి వుండే తత్త్వం జానకి గారిది . ప్రస్తుతం ఆమె వయసు 83 సంవత్సరాలు . అయినా ఆ స్వరం లో మార్పు రాలేదు .
అదే ఆమె ప్రత్యేకత . జానకి గారు మరిన్ని పుట్టిన రోజు పండుగలు చేసుకోవాలని కోరుకుందాం.
Comments
Post a Comment