అక్షరాంజలి - ఒకటి
ఈ సృష్టి ఎంత విచిత్రమైనది
నా దృష్టి ఎంత రమ్యమైనది
నా మానసాకాశంలో
వసంతం రేకులు విప్పుకొంది
నా గుండె తలుపుపై
కోయిల ప్రేమ శబ్దం చేస్తోంది
నాలో రెక్క విప్పుకొని
ప్రణయ నగారా మ్రోగిస్తోంది
నా నరాల్లో వలపు నయాగరా
నా అధరాలపై
సుమ వనాలు మొలుస్తున్నాయి
నా నయనాల్లోని భావాలు
కొత్త పదాలై , సరికొత్త పథాలై
అవతరిస్తున్నాయి
నా అణువణువులో స్పందన
ప్రేమామృతాన్ని చిలుకుతోంది
ప్రకృతి పెదవులపై
వయసు వెన్నెల కాస్తోంది
కాలం కన్నుల్లో మనస్సు ప్రతిఫలిస్తోంది
- భగీరథ
This Poem is in Aksharanjali Book
ReplyDelete