తెలుగు-బంజారా భాషల్లో `సేవాదాస్`
తెలుగు, బంజారా భాషల్లో కేపియన్ చౌహాన్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తోన్న చిత్రం ‘సేవాదాస్’. సుమన్, భానుచందర్, ప్రీతి అశ్రాని, రేఖా నిరోషా నటిస్తున్నారు. హాథీరామ్ బాలాజీ క్రియేషన్స్ పతాకంపై వినోద్ రైనా ఎస్లావత్, సీతారామ్ బాదావత్ సంయుక్తంగా ఈ సినిమా నిర్మిస్తున్నారు. బోలే సంగీతాన్ని సమకూర్చిన ఈ చిత్రంలోని బంజారా భాషకు సంబంధించిన టైటిల్ సాంగ్‌ను గురువారం ప్రసాద్ ల్యాబ్స్‌లో ఆవిష్కరించారు. ఈ పాటను యువ గాయకుడు స్వరాగ్ ఆపించారు. నిజాయితీకి మారుపేరైన ఓ తండ్రి బాటలో నడిచే కొడుకు కథ ఎలా మొదలైంది? ఎలా ముగిసింది? అనేది ‘సేవాదాస్’ చిత్ర కథాంశం. ఈ చిత్రం షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. నటుడు సుమన్ మాట్లాడుతూ...``నేను ఇప్పటి వరకు ఎనిమిది భాషల్లో నటించాను. బంజారా భాషలో రూపొందుతోన్న `సేవాదాస్` తో తొమ్మిదవది . . ఇక ఈ సినిమా లో బంజారా కమ్యూనిటీకి ఆది గురువైన సేవాలాల్ పాత్రలో నటించాను.అని చెప్పారు .బంజారా భాషలో సుమన్ , దర్శకుడు చౌహన్ మాట్లాడారు .
Comments
Post a Comment