ప్లవ నామ సంవత్సర పురస్కారం మరియు కళా మనస్వి బిరుదు
శ్రీమానస ఆర్ట్ థియేటర్స్, చిరు నవ్వు మరియు శ్రీత్యాగరాయ గానసభ సంయుక్తంగా నిర్వహించిన ఉగాది పురస్కారాల్లో తెలుగు విశ్వవిద్యాలయం మాజీ వైస్ ఛాన్సలర్ ఆచార్య ఎల్లూరి శివారెడ్డి గారు ముఖ్య అతిథి గా వచ్చి ఈ అవార్డును బహుకరించారు . మానస ఆర్ట్ థియేటర్స్ కార్యదర్శి రఘుశ్రీ ఈ అవార్డును ప్రకటించి, ఆత్మీయంగా సభను నిర్వహించి, అందరికీ అవార్డులను బహుకరించారు. ఈ సంవత్సరం మానస, గాన సభ అవార్డు తో పాటు కళా మనస్వి బిరుదు కూడా నాకు ప్రదానం చేశారు . మిత్రుడు రఘుశ్రీ ఇతర సబ్యులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు .Popular posts from this blog
ఈరోజు వేటూరి సుందర రామమూర్తి గారి వర్ధంతి వేటూరి వారు మన మధ్య లేకపోయినా వారి పాట తెలుగు సినిమా పూతోటలో ఎప్పటికీ మరిమళిస్తూనే ఉంటుంది. జర్నలిస్టుగా జీవితాన్ని మొదలు పెట్టి ఆ తరువాత సినిమా పాటల రచయితగా అటు క్లాస్ ఇటు మాస్ ను మెప్పించిన మహాకవి వేటూరి .సుందర రామమూర్తి . వేటూరి గారిని తలచుకోగానే 25 సంవత్సరాల నాటి ఓ మధురమైన సంఘటన గుర్తుకొస్తుంది . 1996లో మిత్రులు ప్రసాద్ రెడ్డి, అంజి రెడ్డి నిర్మాతలుగా నేను ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా నిర్మించిన "ప్రియమైన శ్రీవారు " సినిమాకు వేటూరి గారితో ఓ పాట వ్రాయిద్దామని మిత్రుడు , సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్ నాతో చెప్పాడు . తప్పకుండా వ్రాయిద్దాం అని చెప్పాను . ఈ సినిమాలో ఓ నేపధ్య గీతం ఉంది . ఈ పాట అయితే బాగుంటుందని మా ఇద్దరికీ అనిపించింది . వేటూరి గారి ఇంటికి వెళ్లి పాట సన్నివేశం వివరించాము . వారం రోజుల తరువాత పాట సిద్ధమైంది . వేటూరి వారి ఇంటికి పాట కోసం నేను వెళ్ళాను . ఆయన పాట రెడ...
'తారకరామం "ఆధునిక భగవద్గీత ఫిలింనగర్ కల్చరల్ సెంటర్లో జనవరి 18న నా 'తారకరామం ' పుస్తకం పై సమీక్ష సమాలోచన జరిగింది . ఈ సభకు సంబంధించిన వార్త. తారకరామం ఆధునిక భగవద్గీత: పరుచూరి గోపాలకృష్ణ భగీరథ సంపాదకత్వంలో ఎన్.టి.ఆర్. కమిటీ వెలువరించిన తారకరామం గ్రంథం ఆధునిక భగవద్గీతని, ప్రతి తెలుగు వారి ఇంట్లో తప్పకుండా ఉండవలసిన అపురూప గ్రంథమని రచయిత పరుచూరి గోపాలకృష్ణ చెప్పారు. ఎన్.టి. రామారావు వివిధ పత్రికలకు ఇచ్చిన ఇంటర్వ్యూలతో రూపొందించిన తారకరామం పుస్తక సమీక్ష సమాలోచన శనివారం నాడు ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ లో జరిగింది. ఈ సందర్భంగా రచయితల సంఘం అధ్యక్షులు డా. పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ అన్న ఎన్.టి. రామారావు స్వయంగా చెప్పిన ఇంటర్వ్యూలతో భగీరథ చేసిన మంచి ప్రయత్నమని అన్నగారి అభిప్రాయాలు, ఈ తరతానికే కాదు, భవిష్యత్ తరాలకు కూడా మార్గదర్శకంగా ఉంటాయని అందుకే తారకరామం ప్రతిఇంటిలో తప్పనిసరిగా ఉండవలసినటువంటి మహాగ్రంథమని చెప్పారు. జొన్నవిత్తుల మాట్లాడుతూ ఎన్.టి. రామారావుగారు చాలా స్పష్టమైన అభిప్రాయాలతో ఉంటారని, నటుడిగాను, వ్యక్తిగానూ, జీవితంలో రాజీపడలేదని తారకరామం పుస్తకం ఎన...




Comments
Post a Comment