హఠాత్తుగా వై .కె .నాగేశ్వర రావు మృతి
చిరకాల మిత్రుడు , సౌమ్యుడు, యువకళావాహిని సాంస్కృతిక సారథి వై .కె .నాగేశ్వర రావు గారు ఇక లేరు అన్నవార్త నన్ను కలచివేసింది . ఇప్పటికీ ఇది నిజం కాదేమో అనిపిస్తుంది . కొన్ని రోజుల క్రితమే నాగేశ్వర రావు గారితో మాట్లాడాను .
ఇంతలోనే ఇలాంటి వార్త వస్తుందని ఊహించలేదు.
నాగేశ్వర రావు గారితో నాకు 1985 నుంచి పరిచయం . ఆయనకు సాంస్కృతిక రంగం, అన్నా సినిమా రంగం అన్నా ఎంతో ఇష్టం . నాగేశ్వర రావు గారితో నా పరిచయం అప్పటి నుంచి ఆత్మీయంగా కొనసాగుతూనే వుంది . .
కరోనా కష్ట సమయంలో ఎంతో మంది నాటక రంగ కళాకారులను ఆదుకున్న మంచి మనిషి నాగేశ్వర రావు గారు . కరోనా సమయంలో జూమ్ కార్యక్రమాలు చేసిన నాగేశ్వర రావు మళ్ళీ రెండు రాష్ట్రాల్లో వేదికలపై వరుస కార్యక్రమాలు చెయ్యడం మొదలు పెట్టారు. ఊహించని విధంగా నాగేశ్వర రావు ఇలా వెళ్ళిపోతారని అనుకోలేదు . యువకళావాహిని సారధిగా సాంస్కృతిక రంగంలో తనదైన ముద్రవేసుకున్న నాగేశ్వర రావు గారు లేని లోటు ఎప్పటికీ భర్తీకాదు .
నిజాయితీపరుడు, నిగర్వీ సాంస్కృతిక రంగమే ఊపిరిగా బతికిన నాగేశ్వర రావు గారు తన స్మృతులను వదిలి వెళ్లిపోయారు .
Comments
Post a Comment