గ్రామీణ నేపథ్యంలో "మా ఊరి ప్రేమ కథ" ట్రైలర్ 

మంజునాథ్ హీరోగా తనిష్క్ హీరోయిన్ గా శ్రీ మల్లికార్జున స్వామి క్రియేషన్స్ పతాకంపై యస్వీ మంజునాథ్  దర్శకత్వంలో నిర్మించిన చిత్రం "మా ఊరి ప్రేమకథ". సినిమా ట్రైలర్ ను  గురువారం  విడుదల చేశారు.   మా ఊరి ప్రేమకథ ట్రైలర్ ను నిర్మాత  కెయల్ దామోదర ప్రసాద్ఆవిష్కరించారు.

నిర్మాత కెయల్ దామోదర ప్రసాద్ మాట్లాడుతూ.. ప్రేమకథా చిత్రాలు చాలా వచ్చాయి.. వస్తున్నాయి.. అన్నీ ప్రేమకథలు ఒకటే.. ఏం మారవు.  డిఫరెంట్ జోనర్సలో ప్రెజెంటేషన్ కొత్తగా ఉంటే కచ్చితంగా హిట్ అవుతాయి. ఈ చిత్రం ట్రైలర్,  సాంగ్స్ చూస్తుంటే రియలిస్టిక్ గా తీశారనిపిస్తుంది .ఈ చిత్రం హిట్ అయి మంజునాథ్ కి మంచి పేరు రావాలి అన్నారు.. 

టి.ప్రసన్నకుమార్ మాట్లాడుతూ.. రాయలసీమ బాక్డ్రాప్ లో వచ్చిన ప్రేమకథలు అన్నీ మంచి హిట్ అయ్యాయి.. ఆకోవలోనే మంజునాథ్ ఈ చిత్రం చేశారు.. "ప్రేమించుకుందాం రా" సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ఈ చిత్రం కూడా అంతే హిట్ కావాలి అన్నారు.

హీరో, నిర్మాత, దర్శకుడు మంజునాథ్ మాట్లాడుతూ.. ఎంతో వ్యయప్రయాసాలకోర్చి ఈ చిత్రం తీశాను.. ఎన్ని కష్టాలు ఎదురైనా.. అవన్నీ లెక్కచేయకుండా ఈ సినిమా తెరకెక్కించాను.. దానికి మా ఫ్యామిలీ ఎంతో సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేశారు. అలాగే ఈ సినిమా విషయంలో నాకు అండ దండగా ఉండి ఎంతో సహకరిస్తున్న రామసత్యనారాయణ, సంధ్య స్టూడియో రవి గారికి నా థాంక్స్. విలేజ్ బాక్డ్రాప్ లో జరిగే యాక్షన్, లవ్ ఎంటర్టైనర్ చిత్రమిది.. సెన్సార్ కార్యక్రమాలు అన్నీ పూర్తయ్యాయి. సినిమా చూసిన వారంతా మంచి సినిమా తీశారని అభినందించారు. ఏప్రిల్ 22న ఈ చిత్రాన్ని ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో అత్యధిక ధియేటర్సలలో విడుదల చేస్తున్నాం.. అన్నారు.

ఈ సినిమాలో మంజునాథ్, తనిష్క జంటగా  నటించిన ఈ చిత్రంలో రుద్రప్రకాశ్, లక్ష్మయ్య చౌదరి, పద్మారావు, అమృత, ఉష, హేమ సంగీత, శ్రీనివాసులు తదితరులు నటించారు. 


ఈ చిత్రానికి కెమెరా; కళ్యాణ్ సమి, సంగీతం; జయసూర్య, ఎడిటర్; ఆవుల వెంకటేష్, ఫైట్స్; రియల్ సతీష్, దేవరాజ్, పీఆర్ఓ; జిల్లా సురేష్, డాన్స్; గోపీ, కాస్ట్యూమ్స్; శ్రీను, మేకప్; బాబూరావు.

Comments

Popular posts from this blog