భారతమెరికా చదివి పరవశించాను -వాశిరాజు
పాత్రికేయ మిత్రులు భగీరథ రచించిన "భారతమెరికా " చదివిన తరువాత నా మనసు పులకరించింది. అదొక విశిష్ట పుస్తకం అనిపించింది . "భారతమెరికా " ఓ వెలుగు దీపం. ఆ వెలుగుల్లో ఎన్నెన్నో భావాలు . ఆ భావసాగరంలో ఎన్నెన్నో విలువైన అలల సవ్వడులు వింటాం . కళ్లారా చూస్తాం .
నా ప్రియ మిత్రుడు భగీరథలో ఇంతటి పాడిత్యం దాగివుందా ? అక్షరాలకు అందని ఇంతటి భాషా జ్ఞానం ఆయనలో ఇమిడి ఉన్నదా ? అన్నిటికీ మించి తన చుట్టూ వున్న సమాజాన్ని ఇంత నిస్వార్ధంగా ప్రేమించే సంస్కారం ఉందా ? అనిపిస్తుంది . భగీరథ ఓ అరుదైన జర్నలిస్టు , రచయిత , కవి కాబట్టే భారతమెరికా లాంటి అద్భుతమైన పుస్తకం వ్రాయగలిగారనిపిస్తుంది.
భారతమెరికా పుస్తకంలో మనల్ని ఆకట్టుకొని , ఆశ్చర్య పరిచే అంశాలెన్నో వున్నాయి , భారత్ , అమెరికా దేశాల మధ్య సంబంధాలే కాదు 12వ శతాబ్దం నుంచి భారత దేశ చరిత్రను , నన్నయ యుగం నుంచి తెలుగు సాహిత్య పరిణామ క్రమాన్ని భగీరథ ప్రతివారికీ సులభంగా అర్ధమయ్యేలా రచించారు . 2014లో వంగూరి చిట్టెన్ రాజు ఆహ్వానం తో అమెరికా దేశ పర్యటనకు వెళ్లిన భగీరథ ఆ విశేషాలతో మన దేశ చరిత్రను రాయాలనే సంకల్పం కలగడం చాలా కొత్త ఆలోచన . అందుకే భారతమెరికా ఓ విలక్షణ గ్రంథంగా మన ముందు కొచ్చింది .
వ్యక్తిగా భగీరథ చాలా నిరాడంబరుడు, నిగర్వి ,పత్రికా రచయితగా నిజాయితీపరుడు. ప్రతిభా సంపన్నుడు . మంచి మనసున్న మనిషి , స్నేహశీలి . గతంలో భగీరథ 13 పుస్తకాలు రచించారు . అన్నీ నేను చదివాను . ప్రతిదీ విభిన్నము , విలక్షణమైనదే . అయితే ఈ భారతమెరికా ఆయనలోని పరిపూర్ణమైన రచయితను మనకళ్ల ముందు నిలబెడుతుంది.
భారతమెరికా పుస్తకం భగీరథ కు పేరుప్రఖ్యాతులు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా !
-వాశిరాజు ప్రకాశం
సీనియర్ జర్నలిస్టు
Comments
Post a Comment