ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారి అభినందన 


భారత ఉప రాష్ట్రపతి  గౌరవనీయులు వెంకయ్య నాయుడు గారిని వారి  నివాసంలో శుక్రవారం రోజు కలుసుకున్నాను .  నేను రచించిన "భారతమెరికా" పుస్తకాన్ని వెంకయ్య నాయుడు గారికి బహుకరించాను. .వెంకయ్య నాయుడు గారితో నాకు పరిచయం వుంది. ఎప్పుడు కలుసుకున్న వారు ఎంతో ఆప్యాయంగా మాట్లాడతారు . అయితే ఈ సమావేశాన్ని మిత్రులు తుమ్మల రంగారావు గారు ఏర్పాటుచేశారు . హైద్రాబాద్ లో వున్న వెంకయ్య నాయుడు గారి నివాసానికి ఉదయం 9. 00 గంటలకు వెళ్ళాను. . ఉప రాష్ట్రపతి ఓ ఎస్ డి విక్రాంత్ గారిని కలవగానే  వారు నన్ను ఆప్యాయంగా రిసీవ్ చేసుకొని ప్రక్క గదిలో కూర్చోపెట్టారు.  కాసేపటికే  వెంకయ్య నాయుడు గారు మేడ పైనుంచి క్రిందికి వచ్చారు.   వారిని చూడగానే నమస్కరించాను . నన్ను చూడగానే "బాగున్నారా ? అంటూ ఆప్యాయంగా పలుకరించారు.

నేను వారికి భారతమెరికా పుస్తకాన్ని బహుకరించాను . వారు సంతోషంగా స్వీకరించారు . 

భారతమెరికా పుస్తకాన్ని కాసేపు చూశారు . 

"అమెరికాలో మీ పర్యటన విశేషాలా ?" అని అడిగారు 

" అవును సార్ నేను 2014లో అమెరికా దేశాన్ని సందర్శించాను. అయితే  ఆ పర్యటన తో పాటు  12వ శతాబ్దము నుంచి భారత దేశ చరిత్ర క్రోనలా జికల్ ఆర్డర్లో వ్రాయడం జరిగిందని, అలాగే 12వ శతాబ్దము నుంచి తెలుగు సాహిత్య చరిత్రను కూడా  ఇందులో పొందుపరిచానని వారికి వివరించాను . 

:" అలాగా ఒక మంచి ప్రయత్నం చేశారు . వీలున్నప్పుడు తప్పకుండా చదువుతాను" అని చెప్పారు. 

వెంకయ్య నాయుడు గారిని కలవడం ఎంత ఆనందాన్ని కలిగించింది . 

Comments

Popular posts from this blog