"వకీల్ సాబ్" సినిమాకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఆక్షలు
పవన్ కళ్యాణ్ నటించిన తాజా సినిమా వకీల్ సాబ్ సినిమా ఈరోజు ప్రపంచ వ్యాప్తగా విడుదలైంది . పవన్ కళ్యాణ్ జనసేనపార్టీ పెట్టి రాజకీయాల్లోకి వెళ్లిన మూడు సంవత్సరాల తరువాత చేసిన సినిమా వకీల్ సాబ్ . అందుకే
ఈ సినిమా ను నిర్మాత దిల్ రాజు భారీ స్థాయిలో విడుదల చెయ్యడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు . రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ థియేటర్ లను కూడా బుక్ చేసుకున్నారు .
పెద్ద హీరోల సినిమాలు విడుదల సమయంలో థియేటర్ లో అంతకు ముందు వున్న టికెట్ రేట్లకు బదులుగా ఎక్కువ రేట్లు నిర్ణయిస్తారు .అలాగే ప్రీమియర్ షో లు కూడా వెయ్యడానికి ప్లాన్ చేస్తారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కూడా తమకు సహకరిస్తుందనే ఉద్దేశ్యంతో వకీల్ సాబ్ సినిమా విడుదలకు ముందు థియేటర్ రెట్లకన్నా రెండు మూడు రేట్లు టికెట్ రేట్లను పెంచి అడ్వాన్స్ బుకింగ్ కూడా ఇచ్చారు . .
అయితే సినిమా విడుదలకు ఒకరోజు ముందు ఏప్రిల్ 8 గురువారం రోజు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం హోమ్ డిపార్మెంట్ ఒక ఉత్తర్వు జారీ చేసింది . దీని ప్రకారం థియేటర్ లో తాము చూపించిన విధంగా టికెట్ రేట్లు ఉండాలని , ప్రీమియర్ షో లను అనుమతించమని ఇందు లో చాలా స్పష్టంగా పేర్కొన్నారు .
పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీ తో కలసి తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నాడు . అందుకే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇలాంటి ఉత్తర్వు చివరి నిముషంలో తీసుకొచ్చిందని విమర్శలు వినిపిస్తున్నాయి .
ఏమైనా వకీల్ సాబ్ సినిమాకు ఇలాంటి సమస్యలను ఎవరూ ఊహించలేదు . .
Comments
Post a Comment