"వధుకట్నం" సెన్సార్  పూర్తి


 

శ్రీహర్ష, ప్రియ , రఘు , కవిత , ఆర్యన్ , రేఖ , కుషాల్ , అనోన్య , మణి చందన  నటించిన  గ్రీన్ క్రాస్ థియోసోఫికల్  రూరల్ అండ్ అర్బన్ డెవలప్ మెంట్  సొసైటీ సమర్పణ లో "షబాబు ఫిలిమ్స్ " పతాకం పై భార్గవ గొట్టిముక్కల దర్శకత్వం లో  "షేక్ బాబు సాహెబ్" నిర్మించిన  కధా చిత్రం " వధుకట్నం సెన్సార్ పూర్తి చేసుకుంది . 

ప్రస్తుత సమాజం లో మహిళలు ఎన్నో రంగాలలో , పురుషులతో సమానంగా రాణిస్తున్నా  , ఇంకా మహిళల పట్ల వివక్ష కొనసాగుతూనే ఉంది . స్కానింగ్ లో ఆడ శిశువు అని తెలుసుకొని కొందరు అబార్షన్స్ చేయించడం వల్ల  ఆడ పిల్లల నిష్పత్తి తగ్గి పెళ్ళికి మగ పిల్లల కు ఆడ పిల్లలే దొరక్కపోతే  అమ్మాయిలకే "వధుకట్నం ", ఇవ్వాల్సిన రోజులు వస్తాయనే సందేశం తో రూపొందించిన ఈ చిత్ర దర్శక నిర్మాతలను  హేమ అభినందించింది. 

 ఈ చిత్రం పోస్టర్ ను ఆవిష్కరించి స్త్రీలను రక్షించండి ; గౌరవించండి ; స్త్రీ లపైనున్న వివక్షత ను  రూపుమాపండి - అనే సందేశంతో మీ ముందుకు త్వరలో రాబోతున్న ఈ "వధుకట్నం " చిత్రాన్ని ఆదరించి , ఈ చిత్ర టీమ్ ను   ఆశీర్వదించండి అని ఆమె కోరారు . 

ఈ చిత్రాన్ని  చూసిన సెన్సార్ సభ్యులు మంచి సందేశాత్మక చిత్రంగా నిర్మించారంటు అభినందించారని , ఈ చిత్రానికి  "యు / ఏ " సర్టిఫికెట్ ను జారీ చేశారని చిత్ర దర్శకుడు భార్గవ గొట్టిముక్కల చెబుతూ , "సేవ్ ది గర్ల్ చైల్డ్ " అనే ప్రధానాంశంగా ఈ చిత్రం రూపొందించినట్టు పేర్కొన్నారు. 

నిర్మాత షేక్ బాబు సాహెబ్ , అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా, మెచ్చేలా , చక్కటి సందేశాత్మక హాస్య రస కుటుంబ కథా చిత్రంగా నిర్మించామని , ప్రముఖ దర్శకులు కీర్తి శేషులు శ్రీ ఎస్ . డి. లాల్ తనయుడు ఎస్ . డి. జాన్ ఛాయా గ్రహణం ఈ చిత్రానికి ఎంతో ఆకర్షణీయంగా నిలిచిందని , ఆయన శ్రీమతి ప్రముఖ నటి హేమ  మా "వధుకట్నం " చిత్రం పోస్టర్ ను రిలీజ్ చేయడం చాలా సంతోషంగా ఉందని ,ఈ చిత్రాన్ని అన్ని భాషల ప్రేక్షకులు థియేటర్లు , ఓ. టీ .టి . ద్వారా తిలకించి ఆదరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు . 

ఇందులో శ్రీహర్ష, ప్రియ , రఘు , కవిత , ఆర్యన్, రేఖ, కుషాల్, అనోన్య, మణి చందన, పూజ, నాగ లక్ష్మి  ఇంజి, చైతన్య, రాకెట్ రాఘవ, రాము(జబర్దస్త్ ఫేమ్ ), కోటేష్ మానవ్ , శ్రీనివాసులు , నిట్టల శ్రీరామ మూర్తి , మల్లాది భాస్కర్ , రవి శంకర్ , మాస్టర్ అనీష్ శుక్ల , మాస్టర్ ధీరజ్ నటించారు . 


Comments

Popular posts from this blog