అగ్ర కోట, తాజ్ మహల్ సందర్శన


 
అగ్ర కోటను సందర్శించాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. ఢిల్లీ కి అనేకసార్లు వెళ్లినా ఆగ్రా  ఫోర్ట్ ను చూడటానికి వెళ్ళలేకపోయాను 

అయితే 2016లో ఢిల్లీ తెలుగు అకాడమీ నుంచి  ఉగాది అవార్డు స్వీకరించిన తరువాత రోజు ఏప్రిల్ 11న ఆగ్రా  వెళ్ళాను . ముందుగా ఆగ్రా ఫోర్ట్ చూశాను. చరిత్ర అంటే నాకు ఎంతో ఇష్టం . దాని మీద అధ్యయనం చేశాను కాబట్టి ఈ కోటను చూడాలని అనుకున్నాను. అది 2016లో సాధ్యపడింది . 1504లో లోధి వంశం వారు ఈ కోటను నిర్మించారు. 1526లో ఇది మొఘల్ చక్రవర్తుల పాలనలో కొచ్చింది. 94 ఎకరాల విస్తీర్ణంలో అద్భుతంగా నిర్మించారు.  ఈ కోటలో బందీ గా వున్న షాజహాన్ తన ప్రియురాలు ముంతాజ్  కోసం కట్టించిన తాజ్ మహల్ ను చనిపోయేంత వరకు తదేకంగా చూస్తూండేవాడట . యమునా నది ఒడ్డున వున్న ఎంతో సుందరంగా , హుందాగా వున్న తాజ్ మహల్ ఈ కోట నుంచి కనిపిస్తూ ఉంటుంది . ఈ కోటను చూడటం మర్చిపోలేని అనుభూతి .


 

ఆ తరువాత ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తాజ్ మహల్ ను సందర్శించాను . తాజ్ మహల్ నిజంగా అపురూప కట్టడమే . . 




Comments

Popular posts from this blog