కరోన వ్యాక్సిన్ డ్రైవ్ ను ప్రారంభించిన  సోనూసూద్

సోనూ సూద్ బుధవారం అమృత్ సర్ లోని ఓ ఆసుపత్రిలో కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. ఈ సందర్భంగా సోనూ సూద్ కరోనా వ్యాక్సిన్ డ్రైవ్ ని ప్రారంభించారు. కరోనా వ్యాక్సిన్ పట్ల ప్రజల్లో చైతన్యం కలిగేలా, ప్రతి ఒక్కరూ కరోనా వ్యాక్సిన్ తీసుకునేలా ఈ డ్రైవ్ ఉంటుందని ఆయన తెలిపారు.  

కరోనా వ్యాక్సిన్ పట్ల ప్రజల్లో అవగాహన కల్పించడం చాల ముఖ్యమని . అందుకే ఈ వ్యాక్సిన్ డ్రైవ్ ని ప్రారంభిస్తున్నాను. కొంతమంది ప్రజలు కరోనా వ్యాక్సిన్ వేసుకోవాలా వద్దా అని ఇంకా ఆలోచిస్తున్నారు. ప్రతి ఒక్కరు తమ కుటుంబంలోని వృద్దులు కరోనా వ్యాక్సిన్ తీసుకునేలా కృషి చేయాలి. వారి ఆరోగ్యాలు కాపాడుకునేందుకు కరోనా వ్యాక్సిన్ చాల ఉపయోగపడుతుందని సోనూసూద్ తెలిపారు.

పంజాబ్ తో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ కోవిడ్ వ్యాక్సిన్  అందచెయ్యబోతున్నాము. గ్రామీణ ప్రజలు వ్యాక్సిన్వే యించుకోవడానికి ఆలోచన చేస్తున్నారు కావున ఈరోజు అందరి ముందు వ్యాక్సిన్ వేయించుకోవడం జరిగిందని సోనూసూద్ తెలిపారు. త్వరలో పలు ప్రాంతాల్లో  వ్యాక్సిన్    ప్రారంభిస్తానని  ఆయన అన్నారు.. ఈరకంగా కూడా సోను సూద్ ప్రజలకు సహాయపడుతున్నారు 


Comments

Popular posts from this blog