మే 3, 2017 నాటి మధుర స్మృతి
2016 సంవత్సరపు జాతీయ అవార్డులను మే 3వ తేదీన అప్పటి రాష్ట్రపతి స్వర్గీయ ప్రణబ్ ముఖర్జీ గారు ప్రదానం చేశారు . అప్పటి కేంద్ర సమాచార శాఖ మంత్రి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారి ఆధ్వర్యంలో ప్రదానోత్సవం వైభవంగా జరిగింది . జాతీయ అవార్డుల కమిటీ సభ్యుడుగా అశోక హోటల్లో 23 రోజులపాటు సూట్ రూమ్ కేటాయించారు. చైర్మన్ కు మాత్రమే ఇలాంటి సూట్ రూమ్ ఇస్తారు. నేను సభ్యుడును మాత్రమే , అయినా నాకు సూట్ కేటాయించారు.
న్యూ ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో మే 3వ తేదీ సాయంత్రం జరిగిన ఈ వేడుకల్లో నాతో పాటు నా భార్య ఝాన్సీ రాణి పాల్గొన్నది . .
రాష్ట్రపతి అవార్డుల ప్రదానం చెయ్యడానికి ముందు వెంకయ్య నాయుడు గారు ఓ సమావేశ ఏర్పాటు చేసి జ్యూరీ సభ్యులందరికీ సరిఫికేట్లను ప్రదానం చేసి అభినందించారు . ఆ తరువాత జ్యూరీ సభ్యులకు హై టీ కూడా ఏర్పాటు చేశారు . జ్యూరీ సభ్యులకు ఇలా సర్టిఫికెట్స్ ఇవ్వడం అనే సంప్రదాయానికి వెంకయ్య నాయుడు గారు శ్రీకారం చుట్టారు .
రాష్ట్రపతి పాల్గొన్న జాతీయ అవార్డుల సమావేశంలో నాతో పాటి నా భార్య శ్రీమతి ఝాన్సీ రాణిని కూడా ప్రభుత్వ అతిథి గా గుర్తించి ఆమె పేరుతో నా ప్రక్కనే ఓ సీట్ కేటాయించారు . అలాగే అశోక హోటల్లో కూడా ఆమెను ప్రభుత్వ అతిథిగా గుర్తించి గౌరవించారు .
అంతకు ముందు ఎప్పుడూ రాష్ట్రపతి పాల్గొనే జాతీయ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో జ్యూరీ సభ్యుల భార్యలకు ఇలాంటి గౌరవం లభించలేదు.
అందుకే మాకిది ఓ మధురమైన అనుభవం , అనుభూతి .
Comments
Post a Comment