దర్శకరత్న దాసరి 74వ జయంతి
ఈరోజు దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణ రావు గారి 74వ జయంతి.
ఆయన వున్న రోజుల్లో మే 4 సినిమా రంగంలో ఓ పండుగ రోజు . ఉదయం నుంచి రాత్రి వరకు దాసరి గారి ఇల్లు అభిమానులు, ఆత్మీయులు , నిర్మాతలు, దర్శకులు, నటీనటులు, సాంకేతిక నిపుణులు , రాజకీయ నాయకులు, జర్నలిస్టులతో కళకళ లాడుతూ ఉండేది . ఆ వైభవం, ఆ ప్రాభవం ... ఆయనతోనే పోయాయి.
దాసరి నారాయణ రావు గారు.
తెలుగు సినిమాను శ్వాసించి, శాసించిన గొప్ప దర్శకుడు .
సినిమా రంగంలో అతి చిన్న స్థాయి నుంచి ఊహించని స్థాయికి ఎదిగి ఒదిగిన సృజనాత్మక దర్శకుడు దాసరి .
రచయితగా , దర్శకుడుగా , నటుడుగా , నిర్మాతగా , పాటల రచయితగా, పత్రికాధిపతిగా , కేంద్ర మంత్రిగా బహుముఖాలుగా ఎదిగిన అసమాన్యుడు దాసరి .
దాసరి కేవలం తన ఎదుగుదలనే కాదు సినిమా రంగ అభివృద్ధికి కూడా దోహదపడిన వ్యక్తి .
తెలుగు సినిమా రంగంలో అందరూ ఆప్యాయంగా మేస్త్రీ అని ఆప్యాయంగా పిలుస్తారు . నిజంగానే సినిమాకు ఆయన సారధ్యము వహించిన మేస్త్రీ.
దాసరి నారాయణ రావు గారు ఆదరణ , ఆప్యాయత , అతిథి మర్యాద ఎవ్వరూ మర్చిపోలేరు .
అందరూ ఆయనకు ఆత్మీయులే . అందరూ ఆయన్ని ప్రేమించినవారే .
తెలుగు సినిమా రంగంలో దాసరి లేని లోటు ఇప్పుడు చాలా స్పష్టంగా కనిపిస్తుంది .
Comments
Post a Comment