నేడు శ్రీమతి శాంతకుమారి జయంతి
నటి, గాయని శ్రీమతి శాంతకుమారి జయంతి నేడు.శ్రీమతి శాంతకుమారి అసలు పేరు వెల్లాల సుబ్బమ్మ. 17 మే 1920లో కడప జిల్లా రాజుపాలెంలో శ్రీనివాసరావు , పెద్ద నరసమ్మ దంపతులకు జన్మించింది . ఆమె తండ్రి నటుడు ,తల్లి శాస్త్రీయ సంగీత గాయకురాలు . తల్లి తండ్రి వారసత్వంతో తెలుగు సినిమా రంగంలో ప్రవేశించింది. 1936లో నిర్మించిన "శశిరేఖా పరిణయం" ఆమె తొలి చిత్రం . అదే సంవత్సరం పి .పుల్లయ్య దర్శకత్వం వహించిన "సారంగధర " సినిమాలో నటించింది. ఆమె తన పేరును శాంతకుమారి గా మార్చుకుంది . ఈ సినిమా షూటింగ్ సమయంలోనే పుల్లయ్య , శాంత కుమారి ఒకరినొకరు ఇష్టపడి వివాహం చేసుకున్నారు . 1947లో తన మిత్రుడు భీమవరపు నరసింహారావుతో రాగిణి పిక్చర్స్ అన్న సంస్థను ప్రారంభించి అనేక చిత్రాలు నిర్మించారు .
పుల్లయ్య , శాంతకుమారి ఇద్దరు ఆడపిల్లలు . పెద్దమ్మాయి పేరు పద్మ . ఆమె పేరుతో పద్మశ్రీ సంస్థను ప్రారంభించి జయభేరి ,శ్రీవెంకటేశ్వర మహత్స్యం ,ప్రేమించి చూడు లాంటి ఎన్నో చిత్రాలు నిర్మించారు
1941లో వీరు నిర్మించిన "ధర్మపత్ని " సినిమా ద్వారా అక్కినేని నాగేశ్వర రావు గారిని తెలుగు సినిమా రంగానికి పరిచయం చేశారు .
1936 నుంచి 1979 వరకు శాంతకుమారి 250 చిత్రాల్లో విలక్షణ పాత్రలను పోషించింది . శాంతకుమారి ప్రతిభావంతమైన నటి . అనేక పాత్రలను సజీవంగా మనముందు నిలబెట్టారు . వ్యక్తిగా శాంతకుమారి ఎంతో సౌమ్యురాలు . పుల్లయ్య,, శాంతకుమారి దంపతులంటే సినిమా రంగంలో అందరికీ గౌరవం .
శ్రీమతి శాంతకుమారి 2006లో తన 85వ ఏట మరణించారు . .
Comments
Post a Comment