నాలుగు దశాబ్దాల క్రితం "మానవత" ను ఆవిష్కరించిన శ్రీ శ్రీ .
సరిగ్గా 41 సంవత్సరాలక్రితం ఇదే రోజు జూన్ 1, 1980న హైదరాబాద్ అశోక్ నగర్ సిటీ సెంట్రల్ లైబ్రరీలో
నేను రచించిన "మానవత" కవితా పుస్తకానికి మహాకవి శ్రీ శ్రీ గారు ముందు మాట వ్రాసి స్వయంగా మద్రాస్ నుంచి హైదరాబాద్
వచ్చి ఆవిష్కరించారు .
శ్రీ శ్రీ గారిని మద్రాస్ నుంచి హైదరాబాద్ తీసుకవచ్చింది నిర్మాత దర్శకులు యు . విశ్వేశ్వర రావు గారు.
విశ్వేశ్వర రావు గారు వచ్చేటప్పుడు విమానంలో ఇచ్చిన హిందూ దిన పత్రికను తనతో పాటు తీసుకవచ్చారు .
అందులో Bhageeradha- He Brought the ganga down to earth to purify the souls of sinners.అని వ్రాసి వుంది . ఇదే రోజు నేను వ్రాసిన కవితా పుస్తకం ఆవిష్కరించడం గురించి విశ్వేశ్వర రావు ప్రస్తావించి "మానవత "తో భగీరథ సాహిత్య ప్రపంచంలో అడుగుపెడుతున్నారు అని వారు నన్ను మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు .
ఇక ఈ సభలో ఆనాటి హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆవుల సాంబశివ రావు గారు, ఆచార్య తిరుమల గారు, జి .ఎస్ వరదా చారి గారు, హై కోర్టు న్యాయవాది అడుసుమిల్లి పాండురంగారావు గారు , నిర్మాత దర్శకులు పి . పుల్లయ్య గారు పాల్గొన్నారు .
"మానవత" నా సాహిత్య జీవితానికి మంచి పునాది వేసింది . మహామహులు వచ్చి నన్ను ఆశీర్వదించారు .
Comments
Post a Comment