Posts

Showing posts from June, 2021
Image
              హీరోలకు ఓ. కళ్యాణ్ సవాలు  మా అసోసియేషన్ అంపశయ్యపై ఉంది. 15 ఏళ్ల నుంచి మా లో అలజడి తప్ప అభివృద్ధి లేదు మా ఎన్నికలు వచ్చాయంటే యుద్ధ వాతావరణం ఉంటుంది మా ఎన్నికలు పంచాయతీ ఎన్నికల కంటే దారుణంగా తయారయ్యాయి. మా అసోసియేషన్ సర్వీస్ ఓరియంట్ గా లేదు. 25 ఏళ్లుగా మా అసోసియేషన్ ఎందుకు భవనాన్ని నిర్మించడం లేదు. పద్మాలయ స్టూడియో వెనుక 1000 గజాల స్థలం అప్పటి ప్రభుత్వం ఇస్తే నిర్లక్ష్యం చేశారు. ఇప్పుడున్న సినీ పెద్దలకు మా అసోసియేషన్ కు 1000 గజాల స్థలం కొనుగోలు చేసే శక్తి లేదా? అని ప్రశ్నించారు. మా అసోసియేషన్ ఎన్నికల ప్రకటన రాకుండానే ప్రకాశ్ రాజ్ ఎందుకు ముందుకు వచ్చారు? ప్రశ్నించేవాళ్లు తన చుట్టూ ఉన్నారన్న ప్రకాశ్ రాజ్ ... వాళ్లు ఎంత మందిని ప్రశ్నించారు?.మా ఎన్నికల్లో నేను ఆరుసార్లు పోటీ చేసి ఓడిపోయాను . మద్దతిస్తూ గెలిపించిన వాళ్లు ఎన్నికలు పూర్తవగానే తప్పకుంటున్నారు మా అసోసియేషన్ అల్లరి కాకుండా సినీ పెద్దలు కాపాడండి.నేను ఏ పదవికి పోటి చేయడం లేదు, ఎవరికి మద్దతు ఇవ్వడం లేదు.మా ఎన్నికలు జరగకుండా పెద్దలు ఏకగ్రీవంగా ఎన్నుకోవాలి మా అసోసియేషన్ భవనానికి నా ఆ...
Image
  తెరమీద ధీర గంభీరత్వం - తెర వెనుక హాస్య రస వీరత్వం వెరసి రాజబాబు  జీవితంలో ఎదురయ్యే కష్టాలను అధిగమిస్తూ , కన్నీళ్లను తుడిచివేస్తూ నలుగురితో నవ్వుతో, నవ్వులను పండిస్తూ ఆహ్లాదకరంగా  ఎవరు తమ జీవనాన్ని మలచుకుంటారో వారే ధీరోదాత్తులు.  సుఖ దుఃఖాలు లేని జీవితం ఉండదు . కానీ విజయం వచ్చినప్పుడు పొంగిపోయి , అపజయం కలిగినప్పుడు కుంగిపోయే మనుషులు ఎందరో కనిపిస్తారు , కానీ జయాపజయాలు , సుఖదుఃఖాలు అతీతంగా తన చుట్టూ వున్న మిత్రులను కన్నీరు ఉబికేలా నవ్వించే అరుదైన నటుడు , ఆత్మీయ వ్యక్తి రాజబాబు .  రాజబాబు అనగానే ఒకప్పటి హాస్య నట చక్రవర్తి అనుకునేరు . ఈ రాజబాబు తెలుగు సినిమా , టీవీలో  అను నిత్యం ప్రేక్షకులను సమ్మోహపరిచే క్యారెక్టర్ నటుడు రాజబాబు .  రాజబాబు తెర మీద చాలా గంభీరంగా కనిపిస్తాడు , ఏ పాత్రయినా అందులో ఒదిగిపోయే తత్త్వం , ఆ పాత్రను పండించే మనస్తత్వం రాజబాబు ప్రత్యేకత .  అవును రాజబాబు స్వతహాగా  నటుడు , ఆయన మాట్లాడేటప్పుడు ముఖ కవళికలు , శరీర కదలికలు చాలా సహజంగా  ఉంటాయి . అందుకే స్నేహితులు రాజబాబులో వున్న నటుణ్ని గుర్తించారు , ప్రోత్సహించాలనుకున్నారు ....
Image
                బాలకృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు  ఈరోజు నందమూరి బాలకృష్ణ గారి 61వ పుట్టినరోజు .  జూన్ 10, 1960న నందమూరి తారక రామారావు , బసవతారకం దంపతులకు  జన్మించారు .  1974లో "తాతమ్మ కల " సినిమాతో బాల నటుడుగా సినిమా రంగంలో ప్రవేశించిన బాలకృష్ణ తన తండ్రి తో అనేక సినిమాల్లో నటించారు 1983లో "సాహసమే జీవితం " సినిమాతో హీరో అయ్యారు . అక్కడ నుంచి  కథానాయకుడుగా బాలకృష్ణ సినిమా ప్రస్థానం నిరాఘాటంగా సాగుతూ వుంది .  సినిమా రంగంలో బాలకృష్ణ తన తండ్రి ఎన్ .టి .రామారావు గారి వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు .  2001లో నటులు కాంతారావు గారు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర నంది అవార్డుల కమిటీ చైర్మన్ కాగా  ఆ కమిటీలో నేను సభ్యుడుగా వున్నాను . ఆ సంవత్సరం బాలకృష్ణ గారిని "నరసింహ నాయుడు " సినిమాలో నటనకు ఉత్తమ కథానాయకుడుగా ఎంపిక చేశాము . అది బాలకృష్ణ గారికి తొలి నంది అవార్డు .  తెలుగు సినిమా రంగంలో హీరోగా బాలకృష్ణ మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు . 
Image
              ఈరోజు పద్మవిభూషణ్ బాలు 75వ జయంతి   తెలుగు వారంతా గర్వించతగ్గ నేపధ్య గాయకుడు, సంగీత దర్శకుడు, నటుడు, డబ్బింగ్ కళాకారుడు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారి 75వ జయంతి . సంగీత ప్రపంచంలో  ఎప్పటికీ చెరిగిపోని కీర్తి పతాక  మన బాల సుబ్రహ్మణ్యం.  ఆయన   భౌతికంగా మన మధ్యన  లేరు కానీ ఆయన పాట , ఆయన మాట  మనతోనే వున్నాయి . మన మనసులో పల్లవిస్త్తూనే వున్నాయి .  గత సంవత్సరం సెప్టెంబర్ 25వ తేదీ  సినిమా ప్రపంచంలో చీకటి రోజు. కరోనా అనే మహమ్మారి బాలు గారిని మనకు దూరం చేసింది . ఎవరూ ఊహించ లేదు బాలు గారు మన మధ్యనుంచి వెళ్ళిపోతారని . ఈ వార్త విని యావత్ సినిమా ప్రపంచం నివ్వెరపోయింది . తెలుగువారంతా తమ కుటుంబ సభ్యుడిని కోల్పోయినట్టు విషాదంలో మునిగిపోయింది . సంగీత ప్రపంచం మౌనంగా రోదించింది .  బాలు గారు  తాను సాధించిన ఘన విజయాలను చరిత్రగా మనకు అప్పగించి సెలవంటూ వెళ్లిపోయారు .  1966 వ సంవత్సరంలో " శ్రీశ్రీ మర్యాద రామన్న"  సినిమాతో గాయకుడుగా నటుడు, నిర్మాత, దర్శకుడు పద్మనాభం గారు పరిచయం చేశారు...
Image
           బాలు ఎంతో సంతోషించిన రోజు  ఈరోజు నేపధ్య గాయకుడు బాలసుబ్రహ్మణ్యం 75వ జన్మదినం . ప్రపంచంలో వున్న ఆయన అభిమానులంతా  దీనిని వేడుకలా  చేసుకుంటున్నారు . ఆ తరం, ఈతరం, రేపటి తరం కూడా గర్వించే గొప్ప గాయకుడు , మానవతావాది గానగంధ్వరుడు బాలసుబ్రహ్మణ్యం .  2001లో భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డులను ప్రకటించింది . తెలుగు సినిమా రంగంలో ఇద్దరు లెజెండ్స్ ను పద్మ శ్రీ అవార్డు వరించింది .ఒకరు సంగీత ప్రపంచంలో చక్రవర్తి ఎస్ .పి .బాలసుబ్రహ్మణ్యం గారు కాగా మరొకరు చిత్ర పరిశ్రమ అభివృద్ధి కోసం జీవితమంతా అనితరమైన కృషి చేసిన  మహనీయుడు  డి. వి .ఎస్ రాజు గారు .  సంగీతానికి బాలు గారి  కంట్రిబ్యూషన్ అనూహ్యం అలాగే రాజు గారు చేసిన సేవ కూడా అపూర్వం .  స్వర్గీయ ఎన్ .టి .రామారావు మార్గ దర్శకత్వంలో రాయలసీమ కరువు, పాకిస్తాన్ యుద్ధం , దివిసీమ తుఫాను లాంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు .. ఆపన్నులైన ప్రజల సహాయం కోసం రామారావు గారితో పాటు రాజుగారు వెన్నంటే ఉండి నిరంతరం శ్రమించారు . అంతేకాదు సినిమా రంగ ప్రగతి కోసం ఏర్పాటైన ట్రేడ్ బాడీ లకు దిశ...