బాలకృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు 

ఈరోజు నందమూరి బాలకృష్ణ గారి 61వ పుట్టినరోజు . 

జూన్ 10, 1960న నందమూరి తారక రామారావు , బసవతారకం దంపతులకు  జన్మించారు . 

1974లో "తాతమ్మ కల " సినిమాతో బాల నటుడుగా సినిమా రంగంలో ప్రవేశించిన బాలకృష్ణ తన తండ్రి తో అనేక సినిమాల్లో నటించారు 1983లో "సాహసమే జీవితం " సినిమాతో హీరో అయ్యారు . అక్కడ నుంచి 

కథానాయకుడుగా బాలకృష్ణ సినిమా ప్రస్థానం నిరాఘాటంగా సాగుతూ వుంది . 

సినిమా రంగంలో బాలకృష్ణ తన తండ్రి ఎన్ .టి .రామారావు గారి వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు . 

2001లో నటులు కాంతారావు గారు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర నంది అవార్డుల కమిటీ చైర్మన్ కాగా  ఆ కమిటీలో నేను సభ్యుడుగా వున్నాను . ఆ సంవత్సరం బాలకృష్ణ గారిని "నరసింహ నాయుడు " సినిమాలో నటనకు ఉత్తమ కథానాయకుడుగా ఎంపిక చేశాము . అది బాలకృష్ణ గారికి తొలి నంది అవార్డు . 


తెలుగు సినిమా రంగంలో హీరోగా బాలకృష్ణ మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు . 

Comments

Popular posts from this blog