నేను చదివిన ఉన్నత పాఠశాల
1966 నుంచి 1971 వరకు నేను ప్రకాశం జిల్లా ఇంకొల్లు మండలంలోని పావులూరు ఉన్నత పాఠశాల లో చదువుకున్నాను. ప్రతిరోజు మావూరు నాగండ్ల నుంచి 4 కిలోమీటర్లు నడిచి వెళ్ళేవాళ్ళం. ఎండల్లో, వానల్లో పిల్లలందరం కబుర్లు చెప్పుకుంటూ అలసట లేకుండా స్కూల్ చేరేవాళ్ళం. అలాగే సాయంత్రం కూడా అందరం ఆడుతూ పాడుతూ తిరిగి ఇళ్లకు చేరేవాళ్ళం.
10వ తరగతి తరువాత నేను ఇంటర్మీడియట్ చదవడానికి హైదరాబాద్ వచ్చాను . చదువు ఆ తరువాత ఉద్యోగం , తీరికలేని పనులు , ఎప్పుడన్నా వూరు వెళ్లినా స్కూల్ చూడటానికి వెళ్ళలేదు . 50 సంవత్సరాల తరువాత ఫిబ్రవరి 8వ తేదీన పావులూరు స్కూల్ కు వెళ్ళాను . ఆ స్కూల్ ను చూడగానే నాకు చదువు చెప్పిన ఉపాధ్యాయులు , నాతో పాటు చదివిన పిల్లలు, నేను 10వ తరగతిలో ఉండగా ఎస్ .పి .ఎల్ గా ఉన్నప్పుడు (విద్యార్థి నాయకుడు ) ప్రతి రోజు ఉదయం ఉపాధ్యాయులు , విద్యార్థులు ప్రార్ధనలో పాల్గొనేవారు .ఆ జ్ఞాపకాలు నా స్మృతి పథంలో మెదిలాయి .
స్కూల్ అంతా తిరిగి చూశాను . చాలా మార్పులు వచ్చాయి . అయినా మేము చదివిన ఆ భవనం అలాగే వుంది . పదవ తరగతి గదిలో కాసేపు గడిపాను. ఆ అనుభూతి ని మాటల్లో చెప్పలేను.
Comments
Post a Comment