మామిడి హరి కృష్ణ గారు మంచి స్నేహశీలి

శృతి లయ ఆర్ట్స్ అకాడమీ,సీల్ వెల్ కార్పొరేషన్ సంయుక్తంగా నిర్వహిస్తున్న అక్కినేని నాగేశ్వర్ రావు గారి 98వ జయంతి వేడుకల్లో పాల్గొనడానికి   సోమవారం  సాయంత్రం రవీంద్ర భారతి వెళ్ళాను. అదే ప్రాంగణంలో వున్న తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక కార్యాలయం కనిపించింది . సంచాలకులు మామిడి హరికృష్ణ గారు గుర్తుకు వచ్చారు . వారిని కలసి చాలా రోజులవుతుంది . వారికి నా " భారతమెరికా " పుస్తకాన్ని బహుకరించాలి అనుకోని ముందుగా వారి కార్యాలయంలోకి వెళ్ళాను . హరి కృష్ణ గారు నన్ను చూడగానే ఆత్మీయంగా ఆహ్వానించారు . 
హరి కృష్ణ గారికి నా "భారతమెరికా " పుస్తకాన్ని బహుకరించాను . హరికృష్ణ గారికి సాహిత్యమన్నా , సాంస్కృతికమన్నా ఎంతో  ఇష్టం . అభిరుచి, అవగాహన వున్న రచయిత , కవి హరికృష్ణ గారు  రచించిన "ఊరికి పోయిన యాళ్ల ", సుషుప్తి నుంచి ","ఒంటరీకరణ " కవితా గ్రంథాలను నాకు బహుకరించారు . .

  



Comments

Popular posts from this blog