భర్త కోసం జమున "స్వయంవరం"
అలనాటి తార జమున పెళ్లి
ముచ్చట్లు
తెలుగు సినిమా రంగంలో
శ్రీమతి జమున అనగానే అందరికీ గుర్తుకొచ్చేది సత్య భామ . నిజ జీవితంలో కూడా జమున లో
ఆ జాణతనం వుంది. ఆ తెగువ, ధైర్యం , స్తైర్యం , ఆ పట్టుదల మరో కథానాయికలో మనం చూడలేము
.
జమునమూడు రోజుల క్రితమే
85వ సంవత్సరంలో అడుగు పెట్టింది . ఇప్పటికీ ఆరోగ్యంగా , ఉత్సాహంగా యువ కథానాయికలు స్ఫూర్తి నిస్తూనే వుంది .
జమున,1936 ఆగష్టు 30న నిప్పాణి
శ్రీనివాసరావు , కౌసల్య దంపతులకు హంపిలో జన్మించింది. చిన్నప్పుడు
ఆదుకు జనాబాయ్ అన్న పేరు పెట్టారు. ఆ తరువాత
ఈ దంపతులు గుంటూరు జిల్లా తెనాలి తాలూకా దుగ్గిరాలకు మకాం మార్చారు . జామున ఇక్కడే
పెరిగింది . చిన్నప్పటి నుంచి జమున కు నృత్యమన్నా, నటన అన్నా ఇష్టంగా ఉండేది . కూతురు ఆసక్తిని గమనించి శ్రీనివాసరావు
నాటకాలలో ప్రోత్సహించారు . అలా నాటకాలు
వేస్తూ, నృత్యాలు చేస్తున్న జమునను చూసిన డాక్టర్ గరికపాటి రాజారావు తాను నిర్మించి దర్శకత్వం వహించే "పుట్టిల్లు
" సినిమాలో కథానాయికగా అవకాశం ఇచ్చాడు . 1952 లో ఈ సినిమా
నిర్మాణమైంది . అప్పటికి జమున వయసు 16 సంవత్సరాలు .
సినిమా రంగంలో ఎలాంటి అండ
లేకుండా అడుగు పెట్టిన జమునకు పుట్టిల్లు సినిమాలో మంచి పేరు వచ్చింది . ఆ తరువాత
మా గోపి, బంగారు పాప, నిరుపేదలు , వద్దంటే డబ్బు , ఇద్దరు పెళ్ళాలు , దొంగరాముడు, సంతోషం ,మిస్సమ్మ సినిమాల్లో నటించింది . అక్కడ నుంచి జమున కు కథానాయికగా అవకాశాలతో పాటు స్టార్ స్టేటస్ కూడా
వచ్చింది. అలా సాగిపోతున్న జమున జీవితంలో 1959లో అనుకోని సంఘటన
జరిగింది . తన ప్రక్కన నటించే ఓ హీరో అనుచిత ప్రవర్తన ఆమెను బాగా ఇబ్బంది పెట్టాయి . తన మాట మన్నించలేదని ఆ హీరో గారికి
కోపం వచ్చింది . ఆరకంగా జమున ను అక్కినేని నాగేశ్వర రావు , నందమూరి తారక రామారావు తమ ప్రక్క
నటించకుండా బహిష్కరించారు . అయినా జమున భయపడలేదు , పిరికిదానిలా సినిమా రంగం నుంచి పారిపోలేదు . ఆ ఇద్దరు అగ్ర హీరోలను కాదని
దీరగా నిలబడింది . తన చిప్పటి నాటకాల్లో సహా నటుడు జగయ్య , మరో హీరో హరనాథ్ తో నటించడం మొదలు పెట్టింది. మూడు సంవత్సరాలు తనకంటూ పాత్రలను
సృష్టించుకొని నటించింది తప్ప అగ్ర
హీరోలకు సలాం అనలేదు .
ఆ తరువాత నిర్మాత
చక్రపాణి గారు అగ్రహీరోలను జమునను ఒకచోట సమావేశపరిచి మాట్లాడి రాజీ చేసి 'గుండమ్మ కథ " సినిమా మొదలు పెట్టాడు . ఆ వివాదం అలా సమసిపోయినా జమున లో
అభద్రతా భావం ఉండేది. అసలే తెలుగు సినిమా అంటే హీరోల ఆధిపత్యం ఎక్కువ. మళ్ళీ తనకు
అలాంటి చేదు అనుభవం ఎదురు కాకూడదనే ఉద్దేశ్యం తో వివాహం చేసుకోవాలని
నిర్ణయించుకుంది . ఆమె తల్లి తండ్రులు కూడా అదే సరైన నిర్ణయం అన్నారు . ఈ
కుటుంబానికి సన్నిహితుడు , నిర్మాత డి .ఎల్ నారాయణతో చర్చించారు . డి .ఎల్
నారాయణ నిర్మించిన "దొంగల్లో దొర" , "సిపాయి
కూతురు", "దొరికితే దొంగలు" సినిమాల్లో నటించింది. తన
సీనియర్ నాయికలు సినిమా రంగంలో వున్న
వారిని వివాహం చేసుకొని ఎలాంటి మానసిక వ్యధ అనుభవిస్తున్నారో జమున స్వయంగా చేసింది
. అందుకే బయట వాళ్ళను చేసుకోవాలనుకుంది.
మంచివాడు , విద్యావంతుడు అయితే కులం పట్టింపు కూడా లేదన్నారు .
నిర్మాత నారాయణ ఈ విషయం తనకు వదిలి వెయ్యమన్నాడు .
తమ వినోదా సంస్థ
నిర్మించే సినిమాలో నటించడానికి అవకాశం ఇస్తామని
, అందము చదువు వున్న వారు ఫోటోలు , వివరాలు
పంపించమని ఓ ప్రక్కన తయారు చేయించి అన్ని
పత్రికల్లో ఇచ్చాడు . ఐఏఎస్, ఐపీఎస్ , డాక్టర్లు , ఇంజినీర్లు కూడా హీరో కావాలని తమ వివరాలు పంపించారు . అలా వచ్చిన వాటిల్లో
జమునతో సహా కుటుంబ సభ్యులు ఇద్దరినీ ఎంపిక
చేసి వారి గురించి వాకబు చెయ్యమని డి ఎల్ కు చెప్పారు . అందులో ఐఏఎస్ అధికారి
జమునతో వివాహం అనగానే ఎగిరి గంతేశాడు .అయితే ఆమె పేరుతో వున్న ఆస్తులు తన పేరు మీద
పెట్టాలని షరతు విధించాడు . రెండు అతను డాక్టర్ అతను ఎలాంటి షరతులు పెట్టలేదు .
కానీ అన్ని వ్యసనాలు ఉన్నాయని తేలింది . అందుకే ఆ స్వయం వరం జమునకు కలసి రాలేదు .
అదే సందర్భాల్లో జమున పెద
నాన్న కుమారుడు సారధి తిరుపతి వుద్యోగం
చేస్తున్నాడు . తన మిత్రుడు వున్నాడని, అబ్బాయి ఎంతో
బుద్ధిమంతుడని, అందగాడని , ఎలాంటి
దుర్వ్యసనాలు లేవని, అతను హైదరాబాద్ లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జూలజీ
ప్రొఫెసర్ గా పనిచేసున్నాడని చెప్పాడు . పైగా అతను తమకు దూరపు చుట్టం అవుతాడని
కూడా సారధి తెలిపాడు . అబ్బాయి గురించి అన్ని వివరాలు తెలుసుకున్నారు .
అందరికీ నచ్చిన అతనే జూలూరి వెంకట రమణ
రావు .
జమున , రమణరావు ల వివాహం 1965 ఆగష్టు 4న తిరుమల లో శ్రీ
వెంకటేశ్వర స్వామి సన్నిధిలో జరిగింది . వీరిది అన్యోన్య దాపత్యం.
వీరికి వంశీ , స్రవంతి ఇద్దరు సంతానం. రమణ రావు 2014లో చనిపోయాడు .
-భగీరథ
Comments
Post a Comment