దర్శనం మొగులయ్య మనసులో కోరిక ..?


దర్శనం మొగులయ్య. 

ఇప్పుడు ట్రేండింగ్ లో వున్న తెలంగాణ జానపద కళాకారుడు మొగులయ్య.  12 మెట్ల కిన్నెర కళాకారుడుగా కొందరికే తెలిసిన మొగులయ్య ఇప్పుడు పవన్ కళ్యాణ్ హీరోహా నటిస్తున్న" భీమ్లా నాయక్‌" తెలుగు  సినిమాలో "సెభాష్‌.. ఆడాగాదు ఈడాగాదు అమీరోళ్ల మేడాగాదు అన్న పాటను గానం చేసి ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయ్యాడు. ఈ సినిమాకు సాగర్ కె చంద్ర దర్శకుడు కాగా తమన్ సంగీత దర్శకుడు. 

మొగులయ్య గురించి విన్న పవన్ కళ్యాణ్ అతన్నిఅహ్వానించి "భీమ్లా నాయక్ " సినిమాలో టైటిల్ సాంగ్ పాడే అవకాశం కల్పించాడు . ఈ పాటను పాడినందుకు మొగులయ్య కు పవన్ రెండు లక్షల రూపాయలను స్వయంగా అందించాడు. పవన్ కళ్యాణ్ ఎంతో గొప్ప వ్యక్తి అని, మనసున్న కళాకారుడిని మొగులయ్య ప్రశంసిస్తున్నాడు .  

అయితే మొగులయ్య ది చాలా పెద్ద సంసారం.  తెలంగాణ ప్రభుత్వం పెన్షన్ ఇస్తున్నా , ఈ వయసులో కూడా కిన్నెర సహకారంతో పల్లె , పల్లె తిరుగుతూ డబ్బు సంపాదిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు . ఇప్పటికీ మొగులయ్య హైదరాబాద్ నగరంలోని ఓ మురికివాడలో రేకుల షెడ్ లో నివాసం ఉంటున్నాడు . అది కూడా అద్దె ఇల్లు . తను బ్రతికి ఉండగానే తన కుటుంబం కోసం ఓ స్వంత ఇల్లు ఏర్పాటు చెయ్యాలనేది మొగులయ్య కల . జానపద కళ ను నమ్ముకున్న మొగులయ్య కలను పవన్ కళ్యాణ్ నెరవేరుస్తాడని గంపెడంత ఆశతో ఎదురు చూస్తున్నాడు . 

Comments

Popular posts from this blog