దివ్య తేజస్విని పతాకంపై రోహిత్ కృష్ణ సంతోష్ నిఖిత హర్షిత నటీనటులుగా నిర్మిస్తున్న చిత్రం "పల్లె గూటికి పండగొచ్చింది". ఈ చిత్రం మోషన్ పోస్టర్ ను హైదరాబాదులోని ఫిల్మ్ ఛాంబర్ లో విడుదల చేశారు.
చిత్ర దర్శకుడు తిరుమల్ రావు మాట్లాడుతూ . పల్లెల్లో ఉన్న యువత ఏ రకంగా చెడు మార్గం లో వెళుతున్నారు.వారి ప్రవర్తనను మంచి మార్గంలో మళ్లిస్తే ప్రభుత్వ సహకారం లేకుండానే ఎలా విజయం సాధించ వచ్చునో చిత్ర కథాంశం తో రూపొందిన చిత్రం . రాజకీయ నాయకుల సహకారం లేకుండా కూడా ఒక పల్లె ను ఏ రకంగా అభివృద్ధి పథంలో నడిపించవచ్చు అనే పాయింట్ గా తీసుకొని చేసిన సినిమా.ఈ సినిమా చాలా బాగా వచ్చింది.ఇందులోని క్లైమ్యాక్స్ ఎవరూ ఊహించని విధంగా ఉంటుంది. ఆన్నారు.
నిర్మాత లక్ష్మీ మాట్లాడుతూ.."పల్లె గూటికి పండగొచ్చింది" సినిమాలో .. మా అబ్బాయి హీరోగా యాక్ట్ చేశాడు. దర్శకుడు ఈ కథను చాలా చక్కగా తీశాడు.ఇంకా ఈ సినిమాలో నిఖిత, హర్షిత, సుమన్, సాయి కుమార్ ,శియాజి షిండే, రఘు బాబు, అన్నపూర్ణమ్మ, జబర్దస్త్ రాజమౌళి ,జబర్దస్త్ అప్పారావు ,రోలర్ రఘు, గుండు మురళి నటించారు .
Comments
Post a Comment