దర్శకుల సంఘం సభ్యులకు  హెల్త్‌ చెకప్‌

" తెలుగు చలన చిత్ర దర్శకుల సంఘం" అధ్యక్షుడు.. వై. కాశీ విశ్వనాథ్‌, దర్శకుల సంఘం జనరల్‌ సెక్రటరీ.. వి.యన్‌ ఆదిత్య,   ట్రెజరర్‌..  భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో డాక్టర్‌ కమ్‌ యాక్టర్‌ మాదాల రవి సహకారంతో, ‘మెడికవర్‌’ హాస్పటల్స్‌చే తెలుగు ఫిల్మ్‌ డైరెక్టర్స్‌ అసోసియేషన్‌ మెంబర్స్‌కు ఫ్రీ మాస్టర్‌ హెల్త్‌ చెకప్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నటుడు డాక్టర్‌ మాదాల రవి, మెడికోవర్‌ క్లస్టర్‌ హెడ్‌ డాక్టర్‌ దుర్గేష్‌ శివ (మెడికోవర్‌ క్లస్టర్‌ హెడ్‌), డాక్టర్‌ రిచా నిరాల (మెడికోవర్‌ సెంట్రల్‌ హెడ్‌), సంతోష్‌ శుక్లా (ఏ.జి.యమ్‌ మార్కెటింగ్‌ హెడ్‌), మరియు " నాంది" డైరెక్టర్  విజయ్ కనకమేడల.. దర్శకులు.. రవి కుమార్ చౌదరి,  వీరశంకర్‌, చంద్రమహేష్,  సముద్ర, వీరభద్రం చౌదరి, దొరైరాజ్, నటుడు, నిర్మాత..  సురేష్‌ కొండేటి తదితరులు పాల్గొన్నారు. దర్శకుల సంఘం అధ్యక్షుడు కాశీ విశ్వనాథ్‌ మాట్లాడుతూ...ఆకలి వేసిన వాడికి అన్నం పెట్టిన వారు, అవసరంలో ఉన్నవారికి సాయం చేసినవారు, అనారోగ్యంతో ఉన్న వారికి వైద్యం చేసిన వారే నిజమైన హీరోలు. మన అసోసియేషన్‌లో ఉన్న 1,000 మంది సభ్యులకు 5 వేల రూపాయల విలువగల మాస్టర్‌ హెల్త్‌ చెకప్‌ చేయడానికి యాక్సెప్ట్‌ చేసిన మెడికవర్‌ హాస్పిటల్‌ చైర్మన్‌ అనిల్‌కృష్ణ గారికి మరియు సిబ్బందికి కృతజ్ఞతలు. ఆంధ్ర తెలంగాణలోని మన దర్శకుల సంఘ మెంబర్స్‌తో పాటు, వారి కుటుంబ సభ్యులకు మెడికవర్‌ హాస్పిటల్‌లో 50% డిస్కౌంట్‌తో పాటు, ఫ్రీ అంబులెన్స్‌ పికప్‌ కూడా ఏర్పాటు చేశారు. ఇంత మంచి హెల్ప్‌ చేసిన అనిల్‌ కృష్ణగారు నిజమైన హీరో. ఎందుకంటే చాలా మంది ఫ్రెండ్స్‌ ఉన్నా ఎక్కువ మంది కమర్షియల్‌గా ఆలోచిస్తూ ఉంటారు. నేను మాదాల రవి గారితో మన సభ్యులకు ఏదైనా ఉపయోగపడే పని చేయాలి అన్నప్పుడు, తను అనిల్‌కృష్ణ గారితో మన సభ్యుల ఆర్థిక పరిస్థితి, ఆరోగ్య పరిస్థితి గురించి చెప్పారు. దాంతో ఆయన కొంచెం కూడా ఆలోచించకుండా చేద్దామని ముందుకు వచ్చారు. అందరి సహకారంతో ఈరోజు (జనవరి 9) ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా అనిల్‌కృష్ణ గారికి, మెడికవర్‌ సిబ్బందికి, మాదాల రవి గార్లకు..  తెలుగు దర్శకుల సంఘం తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ సందర్భంగా.. నన్ను  ప్రెసిడెంట్ గా గెలిపించిన.. సోదర సభ్యులందరికీ.. నా వెనుక సపోర్ట్ గా  వున్న.. శ్రీ ఎన్ శంకర్ గారికి, సాగర్ గారికి, తమ్ముడు  రవికుమార్ చౌదరికి, సుబ్బారెడ్డికి.. నా హృదయపూర్వక  కృతజ్ఞతలు. ఇంత మంచి కార్యక్రమం  చేసే క్రమంలో.. నా వెన్నంటే వున్న.. జనరల్ సెక్రటరీ వి.ఎన్.ఆదిత్య కి, ట్రెజరర్ భాస్కరరెడ్డి కి. మిగిలిన   కమిటీ సభ్యులందరికీ.. నా ధన్యవాదాలు. అన్నారు.డాక్టర్‌ దుర్గేష్‌ (మెడికోవర్‌ క్లస్టర్‌ హెడ్‌) గారు మాట్లాడుతూ...మా మెడికవర్‌కు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, మహారాష్ట్రలలో 21 బ్రాంచ్‌లు ఉన్నాయి. త్వరలో మరిన్ని రాష్ట్రాలలో బ్రాంచ్‌లు ఏర్పాటు చేస్తున్నాము. ఇక ముందు కూడా ఇలాంటి సహాయం చేయడానికి ముందుంటాము. మా హాస్పిటల్‌లో సాధారణ ప్రజలకు కూడా మేము మంచి క్వాలిటీ గల సర్వీస్‌ అందిస్తున్నాం అన్నారు.నటుడు డాక్టర్‌ మాదాల రవి మాట్లాడుతూ...కాశీవిశ్వనాథ్‌ గారు మన సభ్యులకు ఫ్రీగా హెల్త్‌ చెకప్‌ చేయిస్తే.. బాగుంటుందని   చెప్పినపుడు, అనిల్‌కృష్ణ గారితో ఈ విషయం చెప్పిన సందర్భంలో వారు వెంటనే ఫ్రీగా హెల్త్‌ చెకప్‌తో పాటు 50% డిస్కౌంట్‌, ఫ్రీ అంబులెన్స్‌ సౌకర్యం కల్పిద్దామని ముందుకు వచ్చారు. వారికి నా ధన్యవాదాలు. సభ్యుల పట్ల కాశీ విశ్వనాధ్  గారికి వున్న  తపన నాకు నచ్చింది.   దర్శకులు లేకుండా ఆర్టిస్ట్‌ అనే వారు లేరు. మెడికవర్‌ హాస్పటల్‌ యాజమాన్యానికి, సిబ్బందికి కృతజ్ఞతలు. ఈరోజుల్లో హెల్త్‌కేర్‌ అనేది చాలా ఇంపార్టెంట్‌. నా దృష్టిలో ఏ రోజైతే ఫ్రీగా హెల్త్‌ కేర్‌ ఇవ్వగలమో అప్పుడే మనకు నిజంగా స్వాతంత్య్రం వచ్చినట్టు అన్నారు.



Comments

Popular posts from this blog