మొబైల్ సినిమా ధియేటర్ లో ఆచార్య
మొబైల్ సినిమా హాల్ వచ్చేసింది . ఇది ఒకప్పటి టెంట్ సినిమా థియేటర్ ను గుర్తుకుతెస్తుంది . తూర్పు గోదావరి జిల్లా . రాజానగరం జాతీయ రహదారి పక్కన ఈ ధియేటర్ ను ఏర్పాటు చేశారు . వాతావరణానికి తగ్గట్టు, మంటలు చెలరేగినా ఎలాంటి ప్రమాదం వాటిల్లకుండా గాలి నింపే సాంకేతిక పరిజ్ఞానంతో ఈ థియేటర్ ను ఏర్పాటు చేశారు . ఇందులో 120 సీట్లను ఏర్పాటు చేశారు . ఈ ధియేటర్ పూర్తిగా ఏసీ రూపొందిస్తున్నారు.
“పిక్చర్ డిజిటల్స్” అనే సంస్ధ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజానగరం లో నెలకొల్పుతున్న మొబైల్ ధియేటర్. ఈ థియేటర్ చిరంజీవి , రామ్ చరణ్ నటించిన "ఆచార్య" సినిమాతో ప్రారంభం అవుతుంది .
ఈ థియేటర్ ను ఊడతీసి ఎక్కడికైనా సులభంగా తీసుకొని పోవచ్చు . దేశంలో ఇలాంటి మొబైల్ సినిమా హాళ్లు ప్రారంభం అయ్యే అవకాశాలు వున్నాయి .
Comments
Post a Comment