ఒకే వేదికపై చిరంజీవి, ముఖ్య మంత్రి జగన్
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఒకే వేదికపై కలవబోతున్నారు .
అవును ఈ వార్త నిజమే . వీరిద్దరి కలయికకు ఆచార్య సినిమా వేదిక కాబోతుంది .
మెగాస్టార్ చిరంజీవి , రామ్ చరణ్ నటించిన "ఆచార్య " సినిమా ఈ నెల 29న విడుదలవుతుంది .
కొరటాల శివ దర్శకత్వంలో కొణిదల ప్రొడక్షన్ కంపెనీ మరియు మ్యాటినీ ఎంటర్టైన్మెంట్ నిర్మించిన ఈ భారీ సినిమా ప్రీ రిలీజ్ వేడుక ఈ నెల 23 న విజయవాడ సిద్దార్ద కళాశాల ప్రాంగణంలో జరుగుతుంది .
మెగాస్టార్ , రామ్ చరణ్, పూజ హెగ్డే , కాజల్ అగర్వాల్ తో పాటు ఇంత నటీనటులు , సాంకేతిక నిపుణులు ఈ వేడుకలో పాల్గొంటున్నారు .
అత్యంత భారీ స్థాయిలో ఈ వేదిక రూపొందబోతుంది .
ఈ వేదికపై చిరంజీవి "ఆచార్య " సినిమాకు ముఖ్య అతిధిగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి విచ్చేస్తున్నారు .
సినిమా టికెట్ల రేట్లను పెచాలని చిరంజీవి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని కలసి విజ్ఞప్తి చేశారు . చిరంజీవి తో జగన్ సమావేశం తరువాత జగన్ సినిమా టికెట్ల రేట్లను పెంచారు . చిరంజీవి ప్రతిష్టాత్మకంగా రూపొందించిన "ఆచార్య" సినిమా ప్రీ రిలీజ్ వేడుకను వివిజయవాడలో నిర్వహించడం ఇప్పుడు ప్రాధాన్యతను సంతరించుకుంది .
ఆంధ్ర ప్రదేశంలో సినిమా పరిశ్రమ అభివృద్ధి చెందాలి , అందుకు తమ ప్రభుత్వం చేయూత నిస్తుందని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తెలుగు సినిమా రంగానికి విజ్ఞప్తి చేశారు . జగన్ పిలుపుకు స్పందనగా చిరంజీవి తన " ఆచార్య " సినిమాను ఆంధ్ర ప్రదేశ్లో నిర్వహిస్తున్నారు .
ఇదే వేదికపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సినిమా రంగానికి సంబంధించి పలు వరాలను ప్రకటించే అవకాశం వుంది .
"ఆచార్య " సినిమా ప్రీ రిలీజ్ వేదికపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ని మెగాస్టార్ చిరంజీవి ఘనంగా సత్కరిస్తారని తెలుస్తోంది .
Comments
Post a Comment