దర్శకుడు తాతినేని రామారావు ఇక లేరు 



ప్రముఖ దర్శకుడు తాతినేని రామారావు ఈరోజు తెల్లవారు జామున చెన్నై లో మరణించారు . ఆయన వయసు 84 సంవత్సరాలు. 

1950 వ సంవత్సరం  రామారావు తన సమీప బంధువైన తాతినేని ప్రకాశరావు దగ్గర సహాయ దర్శకుడుగా చేరారు . ఆ తరువాత ప్రత్యగాత్మ దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేశారు . 1966లో  అక్కినేని నాగేశ్వర రావు సావిత్రి నటించిన  నవరాత్రి అన్న సినిమాతో దర్శకుడయ్యారు . రామారావును ప్రసాద్ ఆర్ట్ ప్రొడక్షన్స్ ఏ .వి . సుబ్బారావు దర్శకుడుగా పరిచయం చేశారు . 

1966 నుంచి 2000 వరకు తెలుగు , హిందీ భాషల్లో 70 సినిమాలకు పైగా దర్శకత్వం వహించారు . 

రామారావు కు భార్య జయశ్రీ , కుమారుడు అజయ్ , కుమార్తెలు చాముండేశ్వరి , నాగ  సుశీల వున్నారు . 



Comments

Popular posts from this blog