పుట్టినరోజునే మరణించిన నటుడు ఎమ్ .బాలయ్య
నటుడు, నిర్మాత ,దర్శకుడు మన్నవ బాలయ్య ఈరోజు ఉదయం హైద్రాబాద్లో చనిపోయారు. ఆయన వయసు 94 సంవత్సరాలు.
ఏప్రిల్ 9, 1930వ గుంటూరు జిల్లా చేవపాడు గ్రామం లో మన్నవ గురవయ్య చౌదరి ,అన్నపూర్ణమ్మ దంపతులకు జన్మించారు .
మద్రాస్ లో ఇంజనీరింగ్ చదివే రోజుల్లో నాటకాల్లో నటించేవాడు . అలా నటనపై మక్కువు ఉండటంతో సినిమా రంగంలోని వెళ్లాలని నిర్ణయించుకున్నారు . దర్శకుడు తాపీ చాణిక్య బాలయ్యను ప్రోత్సహించాడు . చాణిక్య దర్శకత్వం వహించిన ఎత్తుకు పై ఎత్తు చిత్రం తో తెలుగు సినిమా రంగంలోకి అడుగు పెట్టారు . ఈ సినిమాను సారధి స్టూడియోస్ నిర్మించింది .
1958 నుంచి 2013వరకు బాలయ్య 300 చిత్రాల్లో నటించారు .ఆయన అమృత ఫిల్మ్స్ సంస్థ ను ప్రారంభించి చెల్లెలి కాపురం, నేరము - శిక్ష, అన్నదమ్ముల కథ , ప్రేమ -పగ , చుట్టాలున్నారు జాగ్రత్త, ఊరికిచ్చిన మాట, కిరాయి అల్లుడు, పసుపుతాడు మొదలైన వైవిధ్యమైన చిత్రాలు నిర్మించారు.
పసుపు తాడు, నిజం చెబితే నేరమా, పోలీసు అల్లుడు చిత్రాలకు దర్శకత్వం వహించారు .
బాలయ్య తన పుట్టిన రోజునే చనిపోవడం యాదృచ్చికమే .
Comments
Post a Comment