సీనియర్ జర్నలిస్ట్ వరదాచారి గారి జీవన సాఫల్య సభ 



సీనియర్ జర్నలిస్ట్ జి .ఎస్ వరదాచారి గారు 91వ సంవత్సరంలో అడుగు పెట్టిన సందర్భంగా వెటరన్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆయన కు జీవన సాఫల్య అభినందన కార్యక్రమాన్ని నిన్న ప్రెస్ కక్లబ్ లో ఏర్పాటు చేసింది . ఈ సందర్భంగా  వరదాచారి గారితో అనుబంధం వున్న సీనియర్ జర్నలిస్టుల వ్యాసాలతో " పరిణత పాత్రికేయం జి .ఎస్ .వరదాచారి " పేరుతో ఓ పుస్తకాన్ని తీసుకొచ్చారు . 


ఈ పుస్తకాన్ని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కె .వి .రమణాచారి ఆవిష్కరించి తొలి ప్రతిని వరదాచారి గారికి బహుకరించారు . 


ఈ సభలో ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ , ఎమ్ .వి .ఆర్ .శాస్త్రి , ఆంధ్ర జ్యోతి ఎడిటర్ కె .శ్రీనివాస్ , వెటరన్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షులు కేశవ్ రావు , ఉపాధ్యక్షులు ఉదయవర్లు , కార్యదర్శి లక్ష్మణ రావు పాల్గొన్నారు .


" పరిణత పాత్రికేయం జి .ఎస్ .వరదాచారి "  పుస్తకంలో నేను ఓ వ్యాసం వ్రాశాను . వరదాచారి గారు అధ్యక్షుడుగా , నేను కార్యదర్శిగా ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ కు పనిచేశాము . ఆ అనుభవాలను ఇందులో వ్రాశాను . ఈ సందర్భంగా రమణాచారి గారితో నన్ను సత్కరించారు .  

Comments

Popular posts from this blog