Posts

Showing posts from December, 2022
Image
"మహానటుడు ,ప్రజానాయకుడు - ఎన్ .టి .ఆర్ " పద్మశ్రీ డి. వి. ఎస్ రాజు గారి సోదరుడు డి . బి .వి .రాజు గారికి " మహానటుడు ,ప్రజానాయకుడు - ఎన్ .టి .ఆర్ " పుస్తకాన్ని బహుకరించాను . 
Image
రెండు దశాబ్దాలనాటి స్మృతి చిత్రమ్  16 డిసెంబర్ 2002 న హైదరాబాద్ నానక్ రామ్ గూడ లోని రామానాయుడు స్టూడియోస్ లో దాసరి నారాయణ రావు గారి "ఫూల్స్ " చిత్రం షూటింగ్ జరుగుతుంది . నేను అప్పుడు ఆంధ్ర ప్రభ దిన పత్రికలో సినిమా పేజీ చూస్తున్నాను .  సినిమా షూటింగ్ కవరేజ్ కోసం నానక్ రామ్ గూడ వెళ్ళాను . అయితే అక్కడ ఒకనాటి అందాల కథానాయిక కృష్ణకుమారి గారు కనిపించారు. చాలా సంతోషం కలిగింది. ఒకప్పుడు స్క్రీన్ మీద యువతరాన్ని ఉర్రూతలూగించిన హీరోయిన్ . ఇప్పటికీ ఆ ముఖంలో గ్లామర్ కనిపిస్తుంది .  ఆమె వైపు అలాగే చూస్తుంటే దర్శకుడు దాసరి నారాయణ రావు గారు గమనించి "రా పరిచయం చేస్తాను "అన్నారు .  ఆమె మద్రాస్ లో ఉండేది కాబట్టి నాకు అప్పటివరకు కలిసే అవకాశం రాలేదు .  దాసరి గారు నా గురించి చెప్పారు .  నేను నమస్కారం పెట్టాను . ఆమె కూడా నమస్కారం అంది.   "మీరు మాట్లాడుతూ వుండండి" అని దాసరి గారు వెళ్లిపోయారు .   మండువా లోగిలిలో షూటింగ్  జరుగుతుంది . తరువాత షాట్ కోసం లైటింగ్ ఏర్పాటు జరుగుతుంది .  కృష్ణకుమారి గారు ఉయ్యాల బల్ల మీద కూర్చున్నారు. నా కోసం ప్రొడక్షన్ బాయ్ ఓ ...
Image
                రాజు గారి 95వ జయంతి వేడుకలు పద్మశ్రీ డి .వి .ఎస్ రాజు గారి 95వ జయంతి వేడుకలు నిన్న ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ లో జరిగాయి . కల్చరల్ సెంటర్ అధ్యక్షుడు ఆదిశేషగిరి రావు , కార్యదర్శి  ముళ్ళపూడి మోహన్ , రాజు గారి సోదరుడు డి ,బి .వి .రాజు,  రాజు గారి రెండవ కుమారుడు డి .వి .కె . రాజు , దర్శకుడు పర్వతనేని సాంబశివ రావు తో పాటు రాజు గారి కుటుంబ  సభ్యులు , కల్చరల్ సెంటర్ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు .  డివిఎస్ రాజు గారి విగ్రహానికి ఆదిశేషగిరి రావు గారు , సాంబశివరావు గారు ,  డి ,బి .వి .రాజు గారు పూల మాలలు వేశారు.  ఈ సందర్భంగా డి .వి .కె . రాజు,  నాకు , సాంబశివ రావు గారికి నూతన వస్త్రాలు  బహుకరించారు .   చాలా సంవత్సరాల తరువాత  డివిఎస్ రాజు గారి జయంతి వేడుక ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్లో జరగడం ఎంతో ఆనందాన్ని కలిగించింది .  కల్చరల్ సెంటర్  ఆవిర్భావానికి ప్రధాన కారకులు , వ్యవస్థాపక అధ్యక్షులు రాజుగారు .