రాజు గారి 95వ జయంతి వేడుకలు
పద్మశ్రీ డి .వి .ఎస్ రాజు గారి 95వ జయంతి వేడుకలు నిన్న ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ లో జరిగాయి . కల్చరల్ సెంటర్ అధ్యక్షుడు ఆదిశేషగిరి రావు , కార్యదర్శి ముళ్ళపూడి మోహన్ , రాజు గారి సోదరుడు డి ,బి .వి .రాజు, రాజు గారి రెండవ కుమారుడు డి .వి .కె . రాజు , దర్శకుడు పర్వతనేని సాంబశివ రావు తో పాటు రాజు గారి కుటుంబ సభ్యులు , కల్చరల్ సెంటర్ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు .
డివిఎస్ రాజు గారి విగ్రహానికి ఆదిశేషగిరి రావు గారు , సాంబశివరావు గారు , డి ,బి .వి .రాజు గారు పూల మాలలు వేశారు.
ఈ సందర్భంగా డి .వి .కె . రాజు, నాకు , సాంబశివ రావు గారికి నూతన వస్త్రాలు బహుకరించారు .
చాలా సంవత్సరాల తరువాత డివిఎస్ రాజు గారి జయంతి వేడుక ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్లో జరగడం ఎంతో ఆనందాన్ని కలిగించింది . కల్చరల్ సెంటర్ ఆవిర్భావానికి ప్రధాన కారకులు , వ్యవస్థాపక అధ్యక్షులు రాజుగారు .
Comments
Post a Comment