తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారం 

ఎన్ .టి .ఆర్  శత  జయంతి సంవత్సరంలో  ఆయన మీద నేను వ్రాసిన "మహానటుడు , ప్రజానాయకుడు - ఎన్ .టి .ఆర్ అన్న పుస్తకానికి  ఎన్ .టి  రామారావు గారు నెలకొల్పిన తెలుగు విశ్వవిద్యాలయం నుంచి కీర్తి పురస్కారం అందుకోవడం ఎంతో ఆనందాన్ని కలిగించింది . 

రచయిత్రి, మహిళాభ్యుదయం కోసం జీవితమంతా కృషి చేసిన  బహుముఖ ప్రజ్ఞాశాలి, ప్రతిభాశీలి శ్రీమతి ఇల్లిందల సరస్వతీ దేవి , ఆమె భర్త  సీతారామారావు పేరు మీద విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన జీవిత చరిత్రలు విభాగంలో నాకు ఈ అవార్డును ప్రదానం చేశారు . 


తెలుగు విశ్వవిద్యాలం లోని డాక్టర్ ఎన్ .టి .ఆర్ కళామందిరం లో బుధవారం రోజు ఉపాధ్యక్షులు ప్రొ . టి .కిషన్ రావు గారు , ఆచార్య భట్టు రమేష్ గారు , రింగ్ రామమూర్తి గారి సమక్షంలో  రాష్ట్ర గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు డాక్టర్ ఆయాచితం శ్రీధర్ గారు ఈ కీర్తి పురస్కారాన్ని  బహుకరించారు. 


ఎన్ .టి .రామారావు శత జయంతి సందర్భంగా ఇది మూడవ అవార్డు . ఎన్ .టి .రామారావు గారితో నాకు 1977 నుంచి పరిచయం వుంది , రామారావు నటుడుగా వున్నప్పుడు , ముఖ్యమంత్రి అయిన తరువాత . పది ఇంటర్వ్యూలు చేశాను . రామారావు గారి జీవితంపై "మహానటుడు , ప్రజానాయకుడు - ఎన్ .టి .ఆర్ " పుస్తకాన్ని 18 రోజుల్లో వ్రాశాను . మే 28, 2022న ఈ పుస్తకాన్ని రామారావు గారి పెద్ద కుమార్తె లోకేశ్వరి , రెండవ కుమార్తె పురందేశ్వరి ఆవిష్కరించారు . 

Comments

Popular posts from this blog