'గాయం' 100 రోజుల వేడుక
ఈరోజు అందాల నటి శ్రీదేవి 60వ జయంతి.జర్నలిస్టుగా ఆమెతో నాకు పరిచయం వుంది , అనేక ఇంటర్వ్యూలు కూడా చేశాను. భారతీయ తెర మీద చెక్కుచెదరని అపురూప, అద్వితీయ నటి శ్రీదేవి. 30 సంవత్సరాలనాటి ఓ జ్ఞాపకం .
రామ్ గోపాల వర్మ దర్శకత్వంలో యార్లగడ్డ సురేంద్ర నిర్మించిన 'గాయం ' సినిమా లో హీరో జగపతి బాబు , రేవతి , ఊర్మిళ నాయికలు . ఈ సినిమా 22 ఏప్రిల్ 1993లో విడుదలై ఘన విజయం సాధించింది .
ఆగస్టులో 'గాయం ' సినిమా శతదినోత్సవం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్ లోని మొదటి ఫ్లోర్ లో వైభవంగా జరిగింది . అప్పట్లో రామ్ గోపాల వర్మ చిత్రాల పబ్లిసిటీ నేను చూసేవాడిని .
'గాయం' సినిమా శతదినోత్సవ వేడుకకు శ్రీదేవిని ముఖ్య అతిథి గా వచ్చి జ్ఞాపికలను అందించారు . శ్రీదేవి నుంచి 'గాయం ' మెమొంటో ను స్వీకరించినప్ప్పటి ఫోటో .
1991లో రామ్ గోపాల్ వర్మ వెంకటేష్ , శ్రీదేవితో 'క్షణం క్షణం ' సినిమా రూపొందించారు . ఆ పరిచయంతో రామ్ గోపాల్ వర్మ ఆహ్వానించగానే శ్రీదేవి ఈ కార్యక్రమానికి వచ్చారు . ఆనాటి శత దినోత్సవ వేడుక ఎంతో ఉత్సాహంగా , కన్నులపండుగగా జరిగింది .
Comments
Post a Comment