45 సంవత్సరాల నాటి అరుదైన ఫోటో


తెలంగాణ సాయుధ పోరాటాన్ని తెర పై చూపించిన గొప్ప సినిమా 'మాభూమి '. ఇది గౌతమ్ ఘోష్ దర్శకత్వం వహించిన మొదటి సినిమా. బి.నరసింగ రావు , జి .రవీంద్రనాథ్ ఈ సినిమాను రూపొందించారు .
ఇందులో సాయి చంద్ ,భూపాల్ రెడ్డి , రామ్ రెడ్డి, బి , నరసింగ రావు, తెలంగాణ శకుంతల , ప్రదీప్ శక్తి ,కాకరాల , గద్దర్ మొదలైన వారు నటించారు .
'బండెనక బండి కట్టి, పదహారు బళ్ళు కట్టి ఈ బండ్లో వస్తావు ..' పాటను గద్దర్ పాడటమే కాదు ఇందులో నటించారు . ఈ పాట చిత్రీకరణ ప్రజ్ఞాపూర్ లో జరిగింది . పా ట చిత్రీకరణ పూర్తి అయిన తరువాత నిర్మాత ,నటుడు నరసింగ రావు , భూపాల్ రెడ్డి , గద్దర్ కలసి తీయించుకున్న ఫోటో ఇది.
'మా భూమి ' పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అంతా హైదరాబాద్ శ్రీ సారథి స్టూడియోస్ లోనే జరిగింది . అప్పుడు నేను జ్యోతి చిత్ర సినిమా వార పత్రిక రిపోర్టర్ గా ఆ సినిమా వార్తలు కవర్ చెయ్యడానికి వెళ్ళేవాడిని . అప్పుడు నరసింగ రావు గారు గద్దర్ ను నాకు పరిచయం చేశారు. ఆ అప్పటి నుంచి నరసింగ రావు , గద్దర్ అనుబంధం కొనసాగింది. మా భూమి సినిమా 23 జనవరి 1979లో విడుదలైంది . అదొక చరిత్ర. అందులో గద్దర్ పాడిన పాట అప్పడు ,ఇప్పుడూ ,ఎప్పుడూ సంచలనమే .
1983లో నరసింగ రావు దర్శకత్వం వహించిన 'రంగుల కల ' సినిమాలో గద్దర్ , 'జమ్ జమల్ మర్రీ వేయి కాళ్ళా జర్రీ ', 'భద్రం కొడుకో జర పైలం కొడుకో ' రెండు పాటలను గానం చేశారు.
ప్రజా గాయకుడు గద్దర్ తన ఉనికిని చాటుకొని మనకు జ్ఞాపకంగా తన పాటను వదలి వెళ్ళాడు .

Comments

Popular posts from this blog