జగదీష్ ప్రసాద్ గారికి 'శకపురుషుడు'
ఎన్ .టి .ఆర్ శత జయంతి సందర్భగా మేము వెలువరించిన 'శకపురుషుడు ' ప్రత్యేక సంచికను ఒకప్పటి ఆంధ్ర జ్యోతి మేనేజింగ్ డైరెక్టర్ కానూరి జగదీష్ ప్రసాద్ గారికి బహుకరించాను . 'శకపురుషుడు ' ప్రత్యేక సంచిక సినిమా విభాగం నా సంపాదకత్వంలో వచ్చిందని చెప్పగానే, 'చాలా మంచి ప్రయత్నం '. ఎప్పటికీ నిలిచిపోయే పుస్తకం . చాలా బాగుంది . కంగ్రాట్యులేషన్స్' అన్నారు .
ఆంధ్ర జ్యోతి సంస్థ నుంచి వెలువడిన జ్యోతి చిత్ర సినిమా వార పత్రిక లో నేను 12సంవత్సరాలు పనిచేశాను . అప్పటి అనుభవాలన్నీ ఇద్దరం గుర్తుచేసుకున్నాము . జగదీష్ ప్రసాద్ గారు నన్ను ఒక ఉద్యోగి లా కాకుండా స్నేహితుడుగా చూసేవారు . ఆంధ్ర జ్యోతి లో పనిచెయ్యడం వల్లనే నేను ఎదిగానని భావన నాలో వుంది . అందుకే నేను ఎన్ .టి .రామారావు గారి శతాబ్ది సందర్భంగా రచించిన 'మహానటుడు ,ప్రజానాయకుడు - ఎన్ .టి .ఆర్ ' అన్న పుస్తకాన్ని అంకితం ఇచ్చాను .
Comments
Post a Comment