
ఈరోజు సూర్యకాంతమ్మ శత జయంతి తెలుగు వారి స్మృతి పథంలో "సూర్యకాంతమ్మ గయ్యాళి అనగానే మనకు గుర్తుకొచ్చే నటి సూర్యకాంతమ్మ. తెలుగు ప్రజల హృదయాల్లో ఎప్పటికీ చెరగని, తరగని రూపం ఆమెది. తెరపైన గయ్యాళి పాత్రలను అద్భుతంగా పోషించే సూర్యకాంతమ్మ లో మానవతా కోణం కూడా ఉందని చాలా మందికి తెలియదు . ఆపదలో వున్నవారిని ఆర్ధికంగా ఆదుకునే మంచి నటి సూర్యకాంతమ్మ. సినిమా రంగంలో అందరు అభిమానిగా ,ఆత్మీయంగా 'అమ్మా ' అని పిలుస్తారు . సూర్యకాంతమ్మ, తూర్పు గోదావరి జిల్లా కాకినాడకు సమీపంలోని వెంకటకృష్ణరాయ పురం గ్రామంలో పొన్నాడ అనంతరామయ్య , శ్రీమతి వెంకట రత్నమ్మ దంపతులకు 14వ సంతానంగా 28 అక్టోబర్ 1924న జన్మించారు . పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అంటారు , అందుకు నిదర్శనం సూర్యకాంతం . ఆరు సంవత్సరాల లేత ప్రాయంలోనే పాడటం , నృత్యం చేయడం మొదలు పెట్టింది. సినిమాలు చూస్తూ పెరిగిన సూర్యకాంతం లో నటిని కావాలన్న కోరిక బలంగా పెరుగుతూ వచ్చింది. తల్లితండ్రులు కూడా కుమార్తె ను ప్రోత్సహించారు . 1944వ సంవత్సరం ఆమె మద్రాసు మహానగరంలో అడుగుపెట్టారు . అప్పుడామె వయసు 20 సంవత్సరాలు. కథానాయికకు ...