అభ్ద్యుదయ భావాలతో ప్రయోజనాత్మక చిత్రాలు 

నిర్మాత హరికృష్ణ 87వ జయంతి 


అక్టోబర్ 2వ తేదీ అనగానే  తెలుగు సినిమా రంగంలో  నిర్మాత హరికృష్ణ గారు గుర్తుకు వస్తారు.  నిర్మాతగా, పంపిణీదారుగా బహుముఖాలుగా ఎదిగారు.  సినిమా రంగంలో విలువలకు ప్రాధాన్యమిచ్చి జీవితాంతం వాటిని పాటించిన మానవతావాది యలమంచి హరికృష్ణ. ఈరోజు ఆయన  87వ జయంతి. 

పంపిణీ రంగంలో చిన్న ఉద్యోగిగా  ప్రారంభమైన ఆయన జీవిత ప్రస్థానం  పంపిణీ దారుగా , నిర్మాతగా  ఊహించని విజయాలు సాధించారు . చివరి వరకు విలువలతో  బ్రతికిన ఎందరికో మార్గ్దర్శకుడయ్యారు . 

కృష్ణా జిల్లా మేడూరు గ్రామంలో యలమంచి వెంకట కృష్ణయ్య , సరస్వతి దంపతులకు కస్తూరిబాయి, విద్యావతి తరువాత మూడవ సంతానంగా హరికృష్ణ అక్టోబర్ 2, 1936వ సంవత్సరంలో జన్మించారు.

వెంకటకృష్ణయ్య తొలుత కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు. అయితే అప్పట్లో ఆంధ్ర దేశంలో కమ్మూనిస్టుల ప్రభావం ఎక్కువగా ఉండేది. కమ్మూనిస్టుల భావాలు, సిద్ధాంతాలకు  యువకులు ఎక్కువ ఆకర్షితులు అవుతుండేవారు. వెంకట కృష్ణయ్య కూడా కమ్మూనిస్టు నాయకులభావాలకు  ప్రభావితమై ఆపార్టీలో చేరారు. 

కమ్మూనిస్టు భావాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి వెంకట కృష్ణయ్య పనిచెయ్యడం మొదలు పెట్టారు. కుటుంబానికి దూరంగా ఉంటూ పార్టీకే అంకితమైన వెంకట కృష్ణయ్య అనతి కాలంలోనే నాయకుడుగా ఎదిగారు . ఆయన ఉపన్యాసాలకు ప్రజలు స్పందించడం మొదలు పెట్టారు. సరిగా అప్పుడే ఆయన ప్రభుత్వము దృష్టిలో పడ్డాడు. పోలీసుల వేట మొదలైంది. ఆయన వారి నుంచి తప్పించుకోవడం కోసం అజ్ఞాతం లోకి వెళ్లిపోయారు ఆయన కోసం పోలీసులు తీవ్రంగా గాలించడం మొదలు పెట్టారు.

చివరకు వెంకట కృష్ణయ్య ఆచూకి కనిపెట్టిన పోలీసులు ఆయన్ని బంధించి కాల్చివేశారు. ఊహించని ఈ ఘటన ఆ కుటుంబాన్ని కలవరపెట్టింది. 



అప్పుడు హరికృష్ణ ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. అప్పటికే ఇద్దరు అక్కల వివాహం జరిగింది. అక్కలు , నాయనమ్మ వారిస్తున్నా , ఇక చదువు కొనసాగించమని, ఉద్యోగం చూసుకొని కుటుంబానికి సహాయపడతానని విజయవాడ వెళ్లిపోయారు. అదే హరికృష్ణ జీవితాన్ని మలుపు తిప్పింది. చాలాకాలం చిన్న ఉద్యోగిగా పనిచేశారు.  1968లో కె .ఎల్ .ఎన్  ప్రసాద్ గారి ఆహ్వానంతో లక్ష్మీ ఫిలిమ్స్ పంపిణీ సంస్థ లో మేనేజర్ గా చేరారు.  నిర్మాత అట్లూరి పూర్ణచంద్ర రావు, దర్శకుడు తాతినేని రామా రావు , హీరో శోభన్ బాబు సహకారంతో 1977 వ సంవత్సరంలో సికిందరాబాద్ లో హరి కృష్ణ “శ్రీ లక్ష్మీ చిత్ర ” పంపిణీ సంస్థను మొదలు పెట్టారు. దీనిని  నందమూరి తారక రామారావు స్వహస్తాలతో ప్రారంభించారు.

1984వ సంవత్సరంలో కృష్ణ చిత్ర అనే నిర్మాణ సంస్థను ప్రారంభించి టి కృష్ణ దర్శకత్వంలో “వందేమాతరం ” సినిమా తో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు.

తరువాత ముత్యాల సుబ్భయ్య తో “అరుణకిరణం “,టి . కృష్ణ తో “దేవాలయం “,ముత్యాల సుబ్బయ్య తో “ఇదా ప్రపంచం “, “మమతల కోవెల “, “ఇన్స్పెక్టర్ ప్రతాప్ “, రేలంగి నరసింహా రావు తో “పద్మావతి కళ్యాణం ” , బాపుతో తో “కల్యాణ తాంబూలం ” ,కోడి రామ కృష్ణతో “గాడ్ ఫాథర్ ” చిత్రాలను నిర్మించారు. తన సినిమాల ద్వారా ఎందరో నటి నటులను, దర్శకులను పరిచయం చేసి, ప్రోత్సహించారు . .

సామాజిక సమస్యలతో నిర్మించిన చిత్రాలకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వము నంది అవార్డులను ప్రదానం చేసి సత్కరించింది .

సినిమా రంగంలో అంచెలంచెలుగా ఎదిగిన హరి కృష్ణ అంటే అందరూ ఎంతో అభిమానంగా ఉండేవారు. రామారావు, నాగేశ్వర రావు , శోభన్ బాబు , కృష్ణ , కృష్ణం రాజు , చిరంజీవి ,, నిర్మాతలు డి .వి .ఎస్ రాజు, రామానాయుడు , ఎమ్మెస్ రెడ్డి , వీబీ రాజేంద్ర ప్రసాద్, అట్లూరి పూర్ణ చంద్ర రావు , తాతినేని రామారావు మొదలైన వారు హరికృష్ణను ఆత్మీయులుగా భావించేవారు .

2013 సెప్టెంబర్ 13న హరికృష్ణ ఇహలోక యాత్ర ముగించారు. 

హరి కృష్ణకు రాజ్య లక్ష్మి దంపతులకు రవి బాబు, అనిల్ బాబు, చిన్న బాబు ముగ్గురు సంతానం. తెలుగు సినిమా రంగంలో యలమంచి హరి కృష్ణ తాను నిర్మించిన చిత్రాల ద్వారా ఆయన స్మృతి ఎప్పటికీ గుర్తుంటుంది. 

- భగీరథ

Comments

Popular posts from this blog