Posts

Showing posts from December, 2023
Image
 నిర్మాత కాకర్ల కృష్ణ స్వర్ణోత్సవం  తెలుగు సినిమా రంగంలో ప్రొడక్షన్ మేనేజర్ గా ప్రవేశించి, తరువాత నిర్మాతగా మారి  కాకర్ల కృష్ణ అంచెలంచెలుగా ఎదిగాడని  నటుడు మాగంటి మురళి మోహన్ చెప్పారు .  1974లో కె .సత్యం దర్శకత్వంలో సూపర్ స్టార్ కృష్ణ, అంజలీదేవి, చంద్ర కళ తో కాకర్ల కృష్ణ రూపొందించిన "ఇంటింటి కథ " సినిమా విడుదలై 50 సంవత్సరాలు. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్ ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్లో కృష్ణ స్వర్ణోత్సవ వేడుకలు జరిగాయి.  కాజా సూర్యనారాయణ , పరుచూరి గోపాల కృష్ణ, కోమటిరెడ్డి లక్ష్మి ఆధ్వర్యంలో నిర్మాత కాకర్ల కృష్ణను ఫిలిం నగర్ దైవ సన్నిధానం వేద పండితులు ఆశీర్వదించారు.  ముఖ్య అతిధిగా వచ్చిన నిర్మాత , నటుడు మాగంటి మురళి మోహన్ మాట్లాడుతూ , కృష్ణ , నేను ఓ 1940 లో జన్మించాము , ఇద్దరం సినిమా పరిశ్రమలో క్రింది స్థాయి నుంచి ఎదిగాము , రాజేంద్ర ప్రసాద్ గారి జగపతి సంస్థ లో కృష్ణ ప్రొడక్షన్ మేనేజర్ గా విజయవంతమైన సినిమాలకు పనిచేశారు . ఆ తరువాత "ఇంటింటి కథ " సినిమాతో నిర్మాత గా మారారు , ఆ తరువాత , ఏడంతస్తుల మీద, ఊరంతా సంక్రాంతి , రాగ దీపం , మొదలైన సినిమాలో బాగా స్వామిగా ప...
Image
  ఎన్ .టి .ఆర్ , ఏ .ఎన్. ఆర్ ను  మొదటిసారి కలిపింది కృష్ణవేణిగారే  "1936లో సి .పుల్లయ్య గారు బాల నటిగా  'అనసూయ'  సినిమా ద్వారా  కృష్ణవేణి గారిని పరిచయం చేశారు.  1938లో ద్రోణంరాజు కామేశ్వర రావు దర్శకత్వం వహించిన 'కచదేవయాని'  సినిమాలో కథానాయికగా నటించారు. ఆ తరువాత  1939లో మీర్జాపురం జమీందారు మేకా వెంకటరామయ్య అప్పారావు బహదూర్ వారిని వివాహం చేసుకున్నారు.  అదే ఆమె జీవితాన్ని అనూహ్యమైన మలుపు తిప్పింది " అని భగీరథ చెప్పారు .   కృష్ణవేణి గారు డిసెంబర్ 24, 1924న రాజమండ్రిలో జన్మించారు. రేపు కృష్ణవేణి గారి 100వ జన్మదినోత్సవాన్ని  ఆకృతి సంస్థ  హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో  ఘనంగా జరుపబోతుంది.   ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో  భగీరథ మాట్లాడుతూ , "1936 నుంచి 1956 వరకు 20 సంవత్సరాల్లో 15 చిత్రాల్లో మాత్రమే నటించారు . అయినా ఆమె తెలుగు సినిమా రఁగంపై  చెరిగిపోని  ముద్ర వేశారు.  1949 ఫిబ్రవరి 19న అక్కినేని, అంజలి నటించిన ' కీలు గుర్రం 'సినిమాను నిర్మించి, దర్శకత్వం వహించింది  కృష్ణ వేణి ...
Image
  రజనీకాంత్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు  ఈరోజు సూపర్ స్టార్ రజనీకాంత్ 74వ జన్మదినోత్సవం. భారతీయ సినిమా రంగంలో ఇప్పటికీ ఆయన సూపర్ స్టారే . ఇలాంటి మరిన్ని పుట్టినరోజు పండుగలు రజినీకాంత గారు చేసుకోవాలి. వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు  
Image
 ఈరోజు మహానటి సావిత్రి 90వ జయంతి  తెలుగు సినిమా రంగంలో కథానాయికల గురించి చెప్పుకోవాలంటే ముందుగా గుర్తొచ్చే పేరు సావిత్రి. ఆమె ఎన్నో చిరస్మరణీయమైన పాత్రలను పోషించారు .   నందమూరి తారక రామారావు, మహానటి సావిత్రి  ఇద్దరూ తేరా మీదనే కాదు నాటక రంగంలోనూ కలసి నటించారని విషయం చాలా మందికి తెలియదు .   ఎన్టీఆర్ కాలేజీలో చదువుతున్న రోజుల్లో నేషనల్ ఆర్ట్ థియేటర్స్   అనే నాటక సమాజాన్ని స్థాపించారు . ఈ సమాజంలో  ఎన్టీఆర్, జగ్గయ్య లతో పాటు సావిత్రి కూడా కలిసి  నాటకాలు వేశారు.  1951లో కె .వి .రెడ్డి దర్శకత్వంలో విజయ ప్రొడక్షన్స్ నిర్మించిన "పాతాళ భైరవి" సినిమాలో ఓ నృత్య సన్నివేశంలో  సావిత్రి నటించింది . ఆరువాత 1952లో  రామారావు గారితో  తొలిసారిగా కథానాయికగా "పల్లెటూరు" చిత్రంలో నటించారు.   ఆ తరువాత  1955లో ఇద్దరూ  "మిస్సమ్మ" చిత్రం లో నటించారు . ఈ సినిమాతో  ఈ జంటకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ఎన్నో చిత్రాల్లో కలిసి చిరస్మరణీయమైన చిత్రాల్లో నటించారు .  పల్లెటూరు,మిస్సమ్మ,కన్యాశుల్కం,భలే అమ్మాయిలు, క...
Image
 రేవంత్ రెడ్డి గారికి అభినందనలు  రేపు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపడుతున్న ఎనుముల రేవంత్ రెడ్డి గారికి అభినందనలు .  పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా నేను రచించిన "మహా నటుడు , ప్రజానాయకుడు -ఎన్ .టి .ఆర్  అన్న పుస్తకాన్ని మిత్రుడు మిద్దె శ్రీరామ్ రెడ్డి తో కలసి ఆ మధ్య రేవంత్ రెడ్డి గారికి బహుకరించాను . పెద్దమ్మ దేవాలయ సమీపంలో వున్న రేవంత్ రెడ్డి  గారి ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన ఎంతో ఆత్మీయంగా మాట్లాడారు . 'ఎన్ .టి .రామారావు గారంటే నాకు అబిమానం ,గౌరవం ' అని ఆరోజు రేవంత్ రెడ్డి గారు నాతో చెప్పారు .  తెలంగాణ రాష్ట్రాన్ని రేవంత్ రెడ్డి గారు మరింత అభివృద్ధి పథంలో నడిపిస్తారని ఆశిస్తున్నాను . 
Image
  నీతికి, నిజాయితీకి, నిబద్దతకు మరో పేరు డి.వి .ఎస్ .రాజు  అవినీతి, ఆశ్రిత పక్షపాతం, అసహనం, అహంభావం అన్నీ రాజకీయ  రంగంలోనే ఉన్నాయని అనుకుంటాం, అయితే ఇందుకు తెలుగు సినిమా రంగం మినహాయింపు కాదు.  నేను, నా కుటుంబం, నా వాళ్ళు అనే భావన, సంకుచితత్వం, స్వలాభం అంతర్లీనంగా సాగుతూనే ఉంటాయి.  'సొంత లాభం కొంత మానుకు, పొరుగు వాడికి తోడుపడవోయి..' అని మహాకవి గురజాడ ఎప్పుడో దేశ ప్రజలకు హిత బోధ చేశాడు. అయితే  అది ఎవరికీ, ఎప్పుడూ  గుర్తుకు రాదు, కారణం  ఆ భావన కలిగిన వ్యక్తులు ఇవ్వాళ బహు అరుదుగా కనిపిస్తారు.  అయితే మానవత్వం, మనిషి తత్త్వం మూర్తీభవించిన మహనీయ వ్యక్తులు  ఎప్పుడు స్ఫూర్తి ప్రదాతలుగా మిగిలిపోతారు .  చదువు, సంస్కారంతో పాటు సామాజిక బాధ్యత  కలిగిన వ్యక్తికి అదే భావన,సేవాగుణం కలిగిన వ్యక్తి తోడైతే ... ? ఆ అనుబంధం ... ఆ మానవతా గుణం ... చిరస్మరణీయమైన కార్యక్రమాలకు శ్రీకారం చుడుతుందని చెప్పవచ్చు .అలాంటి మహనీయులే   పద్మశ్రీ ఎన్ .టి .రామారావు , పద్మశ్రీ డివిఎస్ రాజు.  1952వ సంవత్సరం లో  రామారావు గారు నేషనల్ ఆర్ట్స్  అన...