ఈరోజు మహానటి సావిత్రి 90వ జయంతి
తెలుగు సినిమా రంగంలో కథానాయికల గురించి చెప్పుకోవాలంటే ముందుగా గుర్తొచ్చే పేరు సావిత్రి. ఆమె ఎన్నో చిరస్మరణీయమైన పాత్రలను పోషించారు .
నందమూరి తారక రామారావు, మహానటి సావిత్రి ఇద్దరూ తేరా మీదనే కాదు నాటక రంగంలోనూ కలసి నటించారని విషయం చాలా మందికి తెలియదు .
ఎన్టీఆర్ కాలేజీలో చదువుతున్న రోజుల్లో నేషనల్ ఆర్ట్ థియేటర్స్ అనే నాటక సమాజాన్ని స్థాపించారు . ఈ సమాజంలో ఎన్టీఆర్, జగ్గయ్య లతో పాటు సావిత్రి కూడా కలిసి నాటకాలు వేశారు.
1951లో కె .వి .రెడ్డి దర్శకత్వంలో విజయ ప్రొడక్షన్స్ నిర్మించిన "పాతాళ భైరవి" సినిమాలో ఓ నృత్య సన్నివేశంలో సావిత్రి నటించింది . ఆరువాత 1952లో రామారావు గారితో తొలిసారిగా కథానాయికగా "పల్లెటూరు" చిత్రంలో నటించారు.
ఆ తరువాత 1955లో ఇద్దరూ "మిస్సమ్మ" చిత్రం లో నటించారు . ఈ సినిమాతో ఈ జంటకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ఎన్నో చిత్రాల్లో కలిసి చిరస్మరణీయమైన చిత్రాల్లో నటించారు .
పల్లెటూరు,మిస్సమ్మ,కన్యాశుల్కం,భలే అమ్మాయిలు, కుటుంబ గౌరవం,కార్తవరాయుని కథ, ఇంటిగుట్టు, అప్పుచేసి పప్పుకూడు,బండరాముడు,శ్రీ వెంకటేశ్వర మహాత్మ్యం,విమల,దీపావళి,కలసి ఉంటే కలదు సుఖం,గుండమ్మకథ,ఆత్మబంధువు, నర్తనశాల,
నాదీ ఆడజన్మే, పాండవవనవాసం, దేవత, నిర్దోషి, కంచుకోట, తల్లిప్రేమ, విచిత్రకుటుబం, మాతృదేవత, నిండు దంపతులు,ఎర్రకోట వీరుడు, రక్త సంబంధం వంటి చిత్రాలలో ఎన్టీఆర్,సావిత్రి కలిసి నటించారు.
ఎన్టీఆర్ గారి దర్శకత్వంలో "వరకట్నం" చిత్రం లో సావిత్రి నటించగా, సావిత్రి గారి దర్శకత్వంలో ఎన్టీఆర్ గారు "మాతృదేవత" చిత్రం లో రామారావు , సావిత్రి నటించారు.
1962లో వి .మధుసూదన రావు దర్శకత్వంలో సుందరిలాల్ నహతా ,దూకి నిర్మించిన 'రక్త సంబంధం' సినిమా ఓ క్లాసిక్ గా మిగిలిపోయింది . అన్నాచెల్లెళ్ళ అను బంధానికి అద్దం పట్టిన అపురూప సినిమా . ఈ సినిమాలోని "బంగారు బొమ్మ రావేమే .. పందిట్లో పెళ్లి జరిగెను " అన్న పాటను ఆరుద్ర రాయగా సుశీల గానం చేశారు .
సావిత్రి 1968లో "చిన్నారి పాపలు". 1969లో "మాతృదేవత " అనే రెండు చిత్రాలకు దర్శకత్వం వహించారు . చిన్నారి పాపలు సినిమాలో జగ్గయ్య , జామున,షావుకారు జానకి నటించారు . మాతృ దేవత సినిమాలో రామారావు గారితో సావిత్రి నటించారు .
డిసెంబర్ 6, 1934లో తెనాలి దగ్గర చిరావూరు లో జన్మించిన సావిత్రి 1981డిసెంబర్ 26న మద్రాసులో మరణించారు .
Comments
Post a Comment