Posts

Showing posts from January, 2024
Image
 అక్కినేని నేర్పిన తొలి పాఠం  తెలుగు సినిమా రంగంలో అక్కినేని నాగేశ్వర రావుది ఓ స్ఫూర్తినిచ్చే చరిత్ర . జీరో నుంచి హీరోగా ఎదిగిన మహా నటుడు అక్కినేని నాగేశ్వర రావు 1931లో తెలుగు సినిమా టాకీ ప్రారంభమైతే పది సంవత్సరాల తరువాత అక్కినేని "శ్రీ సీతారామ జననం " చిత్రం ద్వారా హీరోగా పరిచయం అయ్యారు . అప్పటికి ఆయన వయసు 20 సంవత్సరాలు .  1944 లో మొదటి సినిమా  శ్రీ సీతారామ జననం నుంచి 2014లో మనం వరకు అంటే 70 సంవత్సరాల పాటు నటుడుగా కొనసాగారు . తెలుగు , తమిళ ,హిందీ భాషల్లో 255 చిత్రాల్లో నటించారు.  అక్కినేని నాగేశ్వర రావు 1977 లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ కళాప్రపూర్ణ ను స్వీకరించారు.  1968 లో భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ,  1988 లో  భారత ప్రభుత్వం నుంచి పద్మ భూషణ్, 2011లో భారత ప్రభుత్వం నుంచి పద్మవిభూషణ్  మధ్య ప్రదేశ్  ప్రభుత్వం నుంచి కాళిదాస్ సమ్మాన్ , 1980లో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నుంచి రఘుపతి వెంకయ్య నాయుడు అవార్డు,   1991లో కేంద్ర ప్రభుత్వం నుంచి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు 1996లో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఎన్టీఆర్ జాతీయ ప...
Image
  తెలుగు తెరపై వెలుగుల తారక రామం  నేడు అయోధ్యలో రామాలయం ప్రారంభోత్సవం. బాల రాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ట . ఈరోజు మధ్యాహ్నం 12. 29. 08 సెకన్ల నుంచి 12. 30. సెకెన్ల వరకు అంటే 84 సెకన్ల పాటు ఈ ముహూర్తంలో బాల ప్రాణ ప్రతిష్ట జరుగుతుంది . ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారాన్ని ప్రపంచంలోని ఎన్నో దేశాల్లోని ప్రజలు చూడటానికి ఎదురు చూస్తున్నారు .  ఈ సందర్భంగా నందమూరి తారక రామారావు తెరపై ధరించిన రామ పాత్రల గురించి ఒకసారి మననం చేసుకుందాం . శ్రీరాముడు అనగానే ఆయన రూపమే తెలుగు వారికి కనిపిస్తుంది .   శ్రీరాముడు  పాత్రను  ఎంతో మంది  నటులు పోషించినప్పటికీ  మనకు స్ఫురించే వ్యక్తి రామారావు గారు .   1956 లో రామారావు గారు తొలిసారి గా శ్రీరాముని  పాత్రలో చరణదాసి చిత్రంలో కనిపించరు .  ఈ సినిమాలో నాయిక  అంజలి దేవికీ ఒక  కల వస్తుంది. ఆ కలలో తను సీతగా భర్త రామారావు శ్రీరాముడు గా కనిపిస్తారు.ఆ కలలో సీతను అగ్ని పరీక్షకు  ఆదేశించే సన్నివేశం వుంటుంది.ఈ సన్నివేశంలో సీతారాములుగా అంజలి దేవి, రామారావు గారు అద్భుతంగా నటించారు ఆరోజుల్లో చరణదాసి చిత...
Image
  ఈరోజు నందమూరి తారక రామారావు గారి 28వ వర్ధంతి.  రామారావు గారితో జర్నలిస్టుగా ఎన్నో మధుర స్మృతులు వున్నాయి.  రామారావు గారి శతాబ్ది సంవత్సరం లో  నా సంపాదకత్వంలో  "శకపురుషుడు " అనే ప్రత్యేక సంచిక వెలువడింది.  రామారావు గారు నిజంగానే స్ఫూర్తి ప్రదాత.  మహానటుడు , ప్రజానాయకుడు ఎన్.టి. రామారావు గారు తెలుగు ప్రజలకు ఎప్పుడూ ప్రాతః కాల స్మరణీయులే.  
Image
  41 సంవత్సరాల క్రితం 10 ముఖ్యమంత్రిగా రామారావు గారు  మహా నటుడు , ప్రజా నాయకుడు ఎన్ .టి .రామారావు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఇవ్వాళ్టికి  41సంవత్సరాలు .  1983 జనవరి 9న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర 10వ ముఖ్యమంత్రిగా ఎన్ .టి .ఆర్ తో నాటి గవర్నర్ కె .సి .అబ్రహం హైదరాబాద్ లాల్ బహదూర్ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేయించారు .  జ్యోతి  చిత్ర రిపోర్టర్ గా  ఆనాటి  సభలో నేను పాల్గొన్నాను .  ఆ దృశాలు ఇంకా నా కళ్ళ ముందు కదులుతున్నాయి .  రామారావు గారితో అనేకమైన ఇంటర్వ్యూలు చేశాను .  ముఖ్యమంత్రి అయినా తరువాత వారు నాకు ప్రత్యేకమైన ఇంటర్వ్యూ ఇచ్చారు .  రామారావు గారు అరుదైన నటుడు , నాయకుడు .