41 సంవత్సరాల క్రితం 10 ముఖ్యమంత్రిగా రామారావు గారు
మహా నటుడు , ప్రజా నాయకుడు ఎన్ .టి .రామారావు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఇవ్వాళ్టికి 41సంవత్సరాలు .
1983 జనవరి 9న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర 10వ ముఖ్యమంత్రిగా ఎన్ .టి .ఆర్ తో నాటి గవర్నర్ కె .సి .అబ్రహం హైదరాబాద్ లాల్ బహదూర్ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేయించారు .
జ్యోతి చిత్ర రిపోర్టర్ గా ఆనాటి సభలో నేను పాల్గొన్నాను .
ఆ దృశాలు ఇంకా నా కళ్ళ ముందు కదులుతున్నాయి .
రామారావు గారితో అనేకమైన ఇంటర్వ్యూలు చేశాను .
ముఖ్యమంత్రి అయినా తరువాత వారు నాకు ప్రత్యేకమైన ఇంటర్వ్యూ ఇచ్చారు .
రామారావు గారు అరుదైన నటుడు , నాయకుడు .
Comments
Post a Comment