తెలుగు తెరపై వెలుగుల తారక రామం 

నేడు అయోధ్యలో రామాలయం ప్రారంభోత్సవం. బాల రాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ట . ఈరోజు మధ్యాహ్నం 12. 29. 08 సెకన్ల నుంచి 12. 30. సెకెన్ల వరకు అంటే 84 సెకన్ల పాటు ఈ ముహూర్తంలో బాల ప్రాణ ప్రతిష్ట జరుగుతుంది . ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారాన్ని ప్రపంచంలోని ఎన్నో దేశాల్లోని ప్రజలు చూడటానికి ఎదురు చూస్తున్నారు . 


ఈ సందర్భంగా నందమూరి తారక రామారావు తెరపై ధరించిన రామ పాత్రల గురించి ఒకసారి మననం చేసుకుందాం . శ్రీరాముడు అనగానే ఆయన రూపమే తెలుగు వారికి కనిపిస్తుంది . 

 శ్రీరాముడు  పాత్రను  ఎంతో మంది  నటులు పోషించినప్పటికీ  మనకు స్ఫురించే వ్యక్తి రామారావు గారు .  

1956 లో రామారావు గారు తొలిసారి గా శ్రీరాముని  పాత్రలో చరణదాసి చిత్రంలో కనిపించరు .  ఈ సినిమాలో నాయిక  అంజలి దేవికీ ఒక  కల వస్తుంది. ఆ కలలో తను సీతగా భర్త రామారావు శ్రీరాముడు గా కనిపిస్తారు.ఆ కలలో సీతను అగ్ని పరీక్షకు  ఆదేశించే సన్నివేశం వుంటుంది.ఈ సన్నివేశంలో సీతారాములుగా అంజలి దేవి, రామారావు గారు అద్భుతంగా నటించారు


ఆరోజుల్లో చరణదాసి చిత్రం ప్రదర్శించే థియేటర్స్ దగ్గర   శ్రీ రాముని   కటౌట్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకొన్నాయి . 

1956 డిసెంబర్ 20 న చరణదాసి చిత్రం విడుదలైంది.

1958 లో రామారావు గారు సంపూర్ణ రామాయణం తమిళ చిత్రం లో శ్రీరాముడు గా నటించారు.శివాజీ గణేషన్ భరతుడిగా నటించిన ఈ చిత్రంలో సీతగా పద్మిని నటించారు.


తమిళనాట ఘన విజయం సాధించిన ఈ చిత్రాన్ని తెలుగులోకి డబ్ చేశారు .అయితే రామారావు గారికి వేరే నటుడు  డబ్బింగ్ చెప్పడం వల్ల ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చలేదు.


 రామారావు గారు శ్రీరాముడు గా నటించిన లవకుశ చిత్రం ఇప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే వుంది . ఇది  తొలి పూర్తి రంగుల చిత్రం .1958 లోలవకుశ సినిమా  ప్రారంభరమైంది, అయితే    ఆర్థిక కారణాల వల్లన కొంతకాలం  ఆగిపోయి చివరికి 1963లో విడుదలైంది.అయితేనేం ఈ సినిమా ఘన విజయం సాధించింది. లవకుశ సరికొత్త చరిత్ర ను సృష్టించింది.ఈ చిత్రం లో కూడా చరణదాసి సినిమాలో నటించిన అంజలి దేవి, రామారావు గారు సీతరాములుగా నటించారు.


లవకుశ చిత్రాన్ని హింది, బెంగాలీ భాషలల్లోకి డబ్ చేశారు .  అక్కడ కూడా ఈ సినిమా ఘనవిజయం సాధించింది . లవకుశ చిత్రం తరువాత శ్రీరాముడు అంటే  తారకరాముడే అని ప్రజలు విశ్వసించారు . 


శ్రీకృష్ణ సత్య, శ్రీరామాంజనేయ యుద్ధం, శ్రీరామ పట్టాభిషేకం, శ్రీకృష్ణాంజనేయ యుద్ధం చిత్రాలలో కూడా రామారావు గారు  శ్రీరాముడు గా నటించారు. అంతేకాదు సీఐడి,తిక్క శంకరయ్య, అడవిరాముడు వంటి సాంఘిక చిత్రాలల్లో కూడా శ్రీరాముని పాత్రలో ఎన్ .టి .ఆర్  నటించారు. 

పౌరాణిక పాత్రల పోషణతో రామారావు గారు తెలుగు వారికి ఆరాద్య దైవమయ్యారు . 

జగమంతా తారక రామం . జనుల మనస్సులో రాముని రూపం. 

శ్రీరామ జయరామ జయ జయ రామ . 


Comments

Popular posts from this blog