చంద్ర బాబు నాయుడు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు
ఈరోజు తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్ర బాబు నాయుడు గారి జన్మదినోత్సవం .1980లో చంద్ర బాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీలో సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నప్పుడు వారిని మొదటిసారి జ్యోతి చిత్ర సినిమా వార పత్రిక కోసం ఇంటర్వ్యూ చేశాను .
అలాగే చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా వున్నప్పుడు 1997 మరియు 2000 సంవత్సరాలకు వారి నుంచి ఉత్తమ జర్నలిస్టుగా రెండు పర్యాయాలు నంది అవార్డులను స్వీకరించారు .
2010లో ఎన్ .టి .ఆర్. ట్రస్ట్ తరుపున ఉత్తమ జర్నలిస్టు అవార్డును బాబు గారు నాకు ప్రదానం చేశారు.
2023లో ఎన్ .టి .ఆర్. శత జయంతి సందర్భంగా మా కమిటీ ప్రచురించిన "శకపురుషుడు" ప్రత్యేక సంచికకు ఎడిటర్ గా చంద్ర బాబు గారు నన్ను అభినందించారు.
నేను రచించిన "నాగలాదేవి " చారిత్రిక పుస్తకాన్ని బాబు గారు ఆవిష్కరించారు .
చంద్ర బాబు నాయుడు గారు ఈ ఎన్నికల్లో విజేత కావాలని, ఇలాంటి పండుగలు మరెన్నో చేసుకోవాలి.
Comments
Post a Comment