విజయవాడలో  'తారకరామం ' 

శనివారం రోజు విజయవాడ నగరంలోని మురళి రిసార్ట్స్ లో నేను సంపాదకత్వం వహించిన 'తారకరామం ' గ్రంథాన్ని భారత మాజీ ఉపాధ్యక్షులు , పద్మభూషణ్ శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు ఆవిష్కరించారు . తొలి ప్రతిని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్ర బాబు నాయుడు గారు స్వీకరించారు . 



ఎన్ .టి .ఆర్ .లిటరేచర్ కమిటీ  చైర్మన్ జనార్దన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటయింది . 

ఎన్ .టి .ఆర్ . నటించిన 'మనదేశం' సినిమా విడుదలై 75 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా 'తారకరామం ' పుస్తకాన్ని వెలువరించాము . అలనాటి నటి మనదేశం సినిమా నిర్మాత కృష్ణవేణి గారు ప్రత్యేక అతిధిగా హాజరయ్యారు . 



ఈ కార్యక్రమంలో జయప్రద , ప్రభ, కృష్ణం రాజు గారి సతీమణి శ్యామల , బాబూమోహన్ , నిర్మాత అనురాధాదేవి , నిర్మాతలు ఆది ఆదిశేషగిరి రావు , సురేష్ బాబు , కె .ఎస్ .రామారావు , స్రవంతి రవి కిషోర్ ,  డి .వి. కె .రాజు , దామోదర ప్రసాద్ , కైకాల నాగేశ్వర రావు , అట్లూరి నాగేశ్వర రావు  మొదలైనవారు హాజరయ్యారు . 



తారకరామం పుస్తకం వెంకయ్య నాయుడు గారు , చంద్ర బాబు నాయుడు గారి సమక్షంలో విడుదల కావాలనేది నాకోరిక . అది నెరవేరింది . తారక రామం పుస్తకం చాలా బాగుందని ఎంతో మంది చెప్పారు . ఆమారావు గారి అంతరంగాన్ని ఆవిష్కరించే సంపూర్ణ గ్రంథం 'తారకరామం '. 




Comments

Popular posts from this blog