చంద్ర బాబు నాయుడు గారు @75

తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి  శ్రీ నారా చంద్ర బాబు నాయుడు గారి 75వ  జన్మదినోత్సవం. 1980 నుంచి చంద్ర బాబు నాయుడు గారితో నాకు  పరిచయం వుంది . 



1980లో చంద్ర బాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీలో సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నప్పుడు వారిని మొదటిసారి 'జ్యోతి చిత్ర' సినిమా వార పత్రిక కోసం ఇంటర్వ్యూ చేశాను. అలాగే వారి మొదటి ప్రెస్ మీట్ కూడా నేనే ఏర్పాటు చేశాను . 

చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా  వున్నప్పుడు 1997 మరియు 2000 సంవత్సరాలకు వారి నుంచి ఉత్తమ జర్నలిస్టు గా రెండు పర్యాయాలు నంది అవార్డులను స్వీకరించాను  . 



2010లో ఎన్ .టి .ఆర్. ట్రస్ట్ తరుపున ఉత్తమ జర్నలిస్టు అవార్డును బాబు గారు నాకు ప్రదానం చేశారు. 

2023లో ఎన్ .టి .ఆర్. శత జయంతి సందర్భంగా మా కమిటీ ప్రచురించిన "శకపురుషుడు " ప్రత్యేక సంచికను చంద్ర బాబు గారు  ఆవిష్కరించి సంపాదకుడుగా నన్ను అభినందించారు. 

నేను రచించిన "నాగలాదేవి " చారిత్రిక పుస్తకాన్ని చంద్ర బాబు  గారు ఆవిష్కరించారు . 



గత సంవత్సరం డిసెంబర్ 14న విజయవాడలో నేను సంపాదకత్వం వహించిన 'తారకరామం' ప్రత్యేక సంచికను మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు ఆవిష్కరించగా చంద్ర బాబు నాయుడు గారు మొదటి కాపీని స్వీకరించారు. 

గత నెల 30న ఉగాది రోజు ప్రతిష్టాత్మకమైన ' కళా రత్న ' అవార్డు చంద్ర బాబు గారే ప్రదానం చేశారు . 



75వ సంవత్సరంలో ప్రవేశించిన బాబు గారు ఇంకా ఇలాంటి పుట్టినరోజు పండుగలు మరెన్నో చేసుకోవాలి.   



Comments

Popular posts from this blog