పద్మశ్రీ   కోట శ్రీనివాస రావు విలక్షణమైన నటుడు 



కోట శ్రీనివాస రావు ఈరోజు మరణించారనే వార్త దిగ్భ్రాంతిని కలిగించింది. 

నాలుగున్నర దశాబ్దాల కాలంలో తెలుగు , తమిళ, కన్నడ , హిందీ రంగాల్లో 750 సినిమాల్లో వైవిధ్యమైన పాత్రలను ధరించారు. 

కోట శ్రీనివాస రావు గారు 1985లో 'ప్రతిఘటన ' సినిమాలో కాశయ్య పాత్రలో నటించి ఒక్కసారి తెలుగు సినిమా రంగాన్ని తనవైపు తిప్పుకున్నాడు . రామోజీ రావు గారు నిర్మాతగా టి .కృష్ణ దర్శకత్వం వహించారు . 

నేను జ్యోతి చిత్ర సినిమా వార పత్రిక రిపోర్టర్ గా పనిచేసేవాడిని.  శ్రీనివాసరా గారిని మా ఆంధ్ర జ్యోతి కార్యాలయానికి ఆహ్వానించి ఇంటర్వ్యూ చేశాను . అదే సందర్భంలో జర్నలిస్టులతో ఒక సమావేశం ఏర్పాటు చెయ్యమని సలహా ఇచ్చాను . ఆయన తప్పకుండా అని ఆ మరుసటి రోజే నారాయణ గూడా  తాజ్ మహల్ హోటల్లో సమావేశం ఏర్పాటుచేశారు . నేను సహా జర్నలిస్టులందరినీ ఆహ్వానించాను . 

అప్పుడు శ్రీనివాసరావు గారు నారాయణగూడ లోని ఎస్ .బి .ఐ లో పనిచేసేవారు . 

ఆ తరువాత  కొన్నాళ్లకే బ్యాంకు కు లాంగ్ లీవ్ పెట్టి సినిమాలో నటించడం మొదలు పెట్టారు . అక్కడ నుంచి నటుడుగా ఆయన వెనక్కి తిరిగి చూసుకోలేదు . అయితే 2010లో ఆయన కుమారుడు ఆంజనేయ ప్రసాద్ ఆక్సిడెంట్ లో చనిపోయాడు . అప్పటి నుంచి కోట మానసికంగా కృంగిపోయారు . అయినా ఆ బాధ మరిచిపోవడానికి నటిస్తున్నాడు . 

పద్మశ్రీ కోట శ్రీనివాసరావు లేని లోటు తీరనింది . ఆయన కుటుంబానికి సంతాపాన్ని తెలియజేస్తున్నా . 

Comments

Popular posts from this blog