ఉప ముఖ్యమంత్రి భట్టికి ' శకపురుషుడు'




ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు  ఆర్థిక, ప్రణాళిక, ఇంధన శాఖలు నిర్వహిస్తున్న శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారిని  కలసి 'శకపురుషుడు  ' పుస్తకాన్ని బహుకరించాను. 

ఎన్ .టి .రామారావు గారి జయంతి సందర్భంగా ఎన్ .టి .ఆర్. శత జయంతి కమిటీ వెలువరించిన ఈ పుస్తకానికి నేను, విక్రమ్ సంపాదకులం.  

నాతో పాటు నిర్మాత చిన  బాబు (డీవీకే రాజు) , సీనియర్ జర్నలిస్టులు కె. ఉమామహేశ్వర రావు , దుర్గ వడ్లమాని కూడా ఉప ముఖ్య మంత్రి గారిని కలవడం జరిగింది . 



చిన బాబు గారు తమ తండ్రి డీవీఎస్ రాజు గారి జీవిత చరిత్ర 'అంతరంగ తరంగాలు ' దుర్గ గారు సూర్యకాంతమ్మ శత   జయంతి సందర్భంగా వెలువరించిన 'తెలుగింటి  అత్త గారు ' పుస్తకాలను భట్టి విక్రమార్క గారికి బహుకరించారు . 

ఇవ్వాళ ఉదయమా 10. 30 గంటలకు ప్రగతి భవన్ లో ఉప ముఖ్యమంత్రి భట్టిని గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది . 

మేము నలుగురం గత నెలలో జరిగిన గద్దర్ ఫిలిం అవార్డుల కమిటీలో సభ్యులుగా పనిచేశామని , తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డుల కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహించినందుకు భట్టి గారికి  అభినందనలు తెలిపాము . 



మీ అందరి సమష్టి కృషి వల్లనే మేము విజయవంతంగా నిర్వహించామని భట్టి అన్నారు . మంచి పుస్తకాలను బహుకరించినందుకు థాంక్స్ చెప్పి తప్పకుండా చదువుతాను అన్నారు . 

ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు మాతో ఆత్మీయంగా మాట్లాడారు . 

వారికి ధన్యవాదాలు  తెలిపాము. 

Comments

Popular posts from this blog